అంగన్వాడీ వర్కర్స్ ను, హెల్పర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: అంగన్వాడీ వర్కర్స్ ను, హెల్పర్స్ ను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని ప్యాపిలీ తాసిల్దార్ బి.భరతి కి వినతి పత్రం అందజేశారు.ఈసందర్భంగా సోమవారం అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ గత 42 సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నాము మా వేతనాలు మాత్రం పెరగలేదని ,పని భారం ఎక్కువైందని, నూతన కూటమి గత ప్రభుత్వం హయాంలో 42రోజులు నిరువధిక సమ్మోచేశాము, కానీ అప్పటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ కి వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు.ఇప్పటికి నేరవేర్చాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా చేర్చిండంలేదు. కావున తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్లను – అంగన్వాడీ వర్కర్స్ ,హెల్పర్ట్స్ ను ప్రభుత్వ ఉద్యగులుగా గుర్తించాలి. కనీస వేతనం. 2611 వేలు చేయాలి, ఎఫ్ ఆర్ ఎస్ యాప్ ను రద్దు చేయలి.మిని సెంటర్లను మెయిన్ సెంటరీగా మార్చాలి.బాల సంజీవని మెను చార్జీ లు పెంచాలి. టి.ఎ. డిఎ లు మిట్టింగ్లలకు ఇవ్వాలని వారి డిమాండ్లను తెలిపారు. ఈకార్యక్రమంలోబి.నీరజా,మణి,జి.విజయకుమారి,వై.చామండి,కె.గౌరి, టి.నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.