విద్యార్థి ఉద్యమ పోరు కెరటం ఏఐఎస్ఎఫ్
1 min readహోళగుంద మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) నందు ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవ జెండాను ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ చేతుల మీదగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అలుపెరుగని పోరాటాలు చేసి 88 సంవత్సరాలు పూర్తి చేసుకొని 89 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఘన చరిత్ర ఏఐఎస్ఎఫ్ ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ మాట్లాడుతూ ఏఐఎస్‌ఎఫ్ కు భారతదేశంలో ఘనమైన పోరాట చరిత్ర ఉంది. స్వాతంత్య్రం రాక పూర్వమే ఉత్తరప్రదేశ్ లోని లక్నో మహా నగరంలో బెనారస్ విశ్వావిద్యాలయంలో 1936 ఆగస్టు 12 న ఏఐఎస్‌ఎఫ్ ఆవిర్భవించింది. తొలిరోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఈ దేశం నుంచి తరిమికొట్టే ఉద్ధేశంతో, యువతీ, యువకుల్లో దేశభక్తి మెండుగా నింపింది. ఆనాటి ఉద్యమాలలో సంఘానికి సంబంధించిన ఎంతో మంది యువకులు దేశం కోసం బలిదానం చేశారు. పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్య్రనంతరం శాస్త్రీయ విద్యావిధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తుంది. పేద విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం, స్కాలర్‌షిప్‌ల మంజూరు, కాస్మోటిక్ చార్జీల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై నిరంతరం పోరాటాలు సాగిస్తోంది. ఐక్య ఉద్యమాలను నిర్మించి, కలిసి వచ్చే ఇతర సంఘాలతో విద్యార్థుల సమస్యల పట్ల దూసుకుపోతుంది. “చదువుతూ పోరాడు.. పోరాడి సాధించు..” నినాదాలతో విద్యార్థులకు మరింత చేరువ అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను చీల్చిచెండాడుతూ సమరశీల పోరాటాలను కొనసాగిస్తూ సమస్యల సాధన కోసం విశేషంగా కృషిచేసిన ఘనత ఏఐఎస్‌ఎఫ్‌కే దక్కింది. రాష్ట్ర, కేంద్ర బడ్జెట్‌లలో విద్యకు ఎక్కువ నిధులు కేటాయించి, విద్య సామాన్యులకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాలకు పలుమార్లు కనువిప్పు కల్గించింది.అదేవిధంగా జిల్లాలో రాయలసీమ యూనివర్సిటీ, డిగ్రీ, జూనియర్,మోడల్ పాఠశాల ఏర్పాటులో అనేక పోరాటాలు నిర్వహించిందని ఫీజుల నియంత్రణ,పెండింగ్ ఫీజులకై, ప్రభుత్వ విద్య పరిరక్షణకై, జిల్లా సమగ్రభివృద్ధికై అనేక పోరాటానికి నాంది పలికిందన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి సతీష్ కుమార్ ఏఐఎస్ఎఫ్ మండల సహాయ కార్యదర్శి రాజేష్ విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.