ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి
1 min readముద్దటమాగి గ్రామంలో దళితులకు రక్షణ కల్పించాలి
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: మండల పరిధిలోని ముద్దటమాగి గ్రామంలో పీర్ల పండుగ సందర్భంగా గ్రామంలోని మాదిగ కులస్తులపై జరిగిన దాడి ఘటనలో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ముద్దాయిలుగా ఉన్న నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ ఏ యం ప్రసాదరాజుకు వినతి పత్రం అందిస్తూ నిందితులపై కేసు నమోదు అయి డీఎస్పీ విచారణ ముగిసినప్పటికీ ఇంకా నిందితులను అరెస్ట్ చేయక పోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామాలలో దళితులపై దాడులు చేయడం వ్యవస్థలను ఉపయోగించుకుని రాజీల కోసం ప్రయత్నం చేయడం, కౌంటర్ కేసులు బనాయించడం సాధారణమైపోయిందని దళిత సంఘాల నాయకులు విమర్శించారు. గ్రామంలో దళితులను కూలి పనులకు పిలవద్దని, ఎటువంటి లావాదేవీలు చేయవద్దని మాట్లాడుకుంటూ సామాజికంగా బహిష్కరించేలా వారు ప్రవర్తిస్తున్నారని తాసిల్దార్ కుతెలిపారు. ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు ఎం ఆర్ పి ఎస్ వెంకటేష్ మాదిగ, వీరేష్ మాదిగ, పకీరప్ప మాదిగ, దళిత సమాఖ్య నాయకులు నల్ల మల్లేష్, సిద్దార్థ స్కూల్ చిదానంద సార్,డి వై ఎస్ నాయకులు కన్నారావు, సినిమా మంగన్న, నాగరకన్వీ వెంకటేష్, ఇంగాళాదాహల్ మల్లి, కెంచప్ప,తదితరులు పాల్గొన్నారు.