దేవాలయ అభివృద్ధికి కృషి:బిషప్ జ్వాన్నేస్..
1 min readబిషప్ కు ఘన స్వాగతం పలికిన విచారణ పెద్దలు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): ఎన్నో ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న దేవాలయ నిర్మాణానికి కృషి చేస్తానని కర్నూలు(ఆర్ సీఎం)మేత్రాసన బిషప్ శ్రీ గోరంట్ల జ్వాన్నేస్ అన్నారు.మంగళవారం ఉ 10 గంటలకు నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని ఉప్పలదడియ ఆర్.సి.యం విచారణ దేవాలయాన్ని నూతన బిషప్ పరిశీలించారు. నూతనంగా బిషప్ అయిన తర్వాత మొదటిసారిగా విచారణకు వచ్చారు.బిషప్ అయిన తర్వాత జిల్లాలోని అన్ని విచారణలకు వెళ్తూ అక్కడి స్థితిగతులను విచారణ గురువులు మరియు విచారణ పెద్దలను అడిగి తెలుసు కుంటున్నారు.చివరి రోజున నిన్న ఉప్పలదడియ దేవాలయాన్ని సందర్శించి విచారణ గురువు మరియు పెద్దలతో మాట్లాడారు. దేవాలయ ప్రాంగణంలో మరియు ఎన్నో ఏళ్ల క్రితం దేవాలయ నిర్మిస్తూ అసంపూర్తిగా నిలిచిపోయిన దేవాలయాన్ని బిషప్ పరిశీలించి ఈ దేవాలయం నిర్మాణం పూర్తయ్యే విధంగా నా వంతుగా కృషి చేస్తానని అంతే కాకుండా ఇక్కడ హాస్టల్ మరియు సిస్టర్స్ కాన్వెంట్ మరమ్మతులు చేయించి వచ్చే జూన్ విద్యా సంవత్సరంలోపు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటానని బిషప్ అన్నారు.వచ్చే నెలలో ఇక్కడ 10 గ్రామాల ప్రజలతో కలిపి దివ్యబలి పూజ ఏర్పాటు చేద్దామని అన్నారు.ముందుగా బిషప్ కి విచారణ గురువు డి మధుబాబు మరియు విచారణ పెద్దలు మహిళలు భారీ గజ మాలలతో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఆనందరావు,పక్కిరయ్య, మాజీ ఎంపీటీసీ ఈరన్న, సామన్న రత్నపాల్ దేవరాజ్ ఏసన్న బాలస్వామి చిన్నప్ప జాన్ హరి డేవిడ్ రత్నం ప్రసాద్,బాబు, ఫ్రాన్సిస్ పాల్గొన్నారు.