ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి
1 min readఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి
పల్లెవెలుగు వెబ్ ఆదోని: ఆదోని అసెంబ్లీ పరిధిలో ప్రతి ఇంటిపైన ,ప్రతి షాప్ పైన, ప్రతి కార్యాలయం పైన మన దేశం యొక్క జాతీయ జెండాను గౌరవించే విధంగా ప్రతి ఒక్కరూ మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు. మంగళవారం ఆదోనిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుండి ఆదోని ఏరియా ఆసుపత్రి వరకు జాతీయ జెండాలతో భారీ ఎత్తున భారతీయ జనతా యువమోర్చా BJYM ఆధ్వర్యంలో తిరంగ యాత్రను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి మాట్లాడుతూ జాతీయ జెండాను గౌరవించిన వాళ్లు దేశంలో ఉండడం అనవసరమని అన్నారు.స్వాతంత్రం వచ్చి ఏడు నార దశాబ్దాలు అవుతున్నందున ప్రతి వ్యక్తి తన ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాన నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని అన్నారు. జాతీయ జెండాను గతంలో కేవలం విద్యాసంస్థల్లో , ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రమే ఎగురవేసే పరిమితి మాత్రమే ఉండేది. కానీ Narendra Modi ప్రభుత్వం అందరికీ తమ ఇళ్ళపై జాతీయ జెండాను ఎగురవేసుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రధాని మోడీ సారథ్యంలో భారతదేశంలోని ప్రజలందరూ జాతీయ జెండాను గౌరవించి జండా ఎగరవేసి దేశభక్తిని చాటుకునే అవకాశం కల్పించారని అన్నారు.ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం ఎందరో మహానుభావులు, యోధులు చేసిన పోరాటం, అలాగే లక్షల మంది దేశభక్తులు స్వాతంత్ర్య పోరాటంలో చేసిన ప్రాణత్యాగం ఫలితం ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్ర్యాలు మనం వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.బంగ్లాదేశ్ ప్రధాని మన దేశానికి వచ్చి శరణు కోరుతుంటే మన దేశ బలమేంటో అర్థం చేసుకోవాలని అన్నారు. ర్యాలీలో ఆదోనికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పట్టణం లోని దేశభక్తులు ఈ యొక్క తిరంగా యాత్రలో పాల్గొన్న్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ , జనసేన పార్టీ ఆదోని సమన్వయకర్త మల్లప్ప ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విట్ట రమేష్ ,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కేశవరం చౌదరి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర కుమార్, అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజుగౌడ్, మధుసూదనా శర్మ, చిన్న , కిట్టు ,మల్లికమ్మ ,జిల్లా కార్యదర్శి రమాకాంత్ , యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్, మండల అధ్యక్షులు కె గోపి, పట్టణ అధ్యక్షులు జింద్ సాయి , శ్రీకాంత్ , రాహుల్ , రమేష్ ఆచారి , నాగార్జున ,రంగనాథ్ రెడ్డి , బెస్తా నాగరాజ్ ,అబ్బాస్ అలీ ,వైపి వీరేష్ ,భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.