జగనన్న కాలనీ సమస్యలు పరిష్కరించాలని గౌరువెంకట రెడ్డిని కలిసిన ప్రజలు
1 min readపల్లెవెలుగు కల్లూరు అర్బన్ : కర్నూలు నగరంలోని ఇండస్ట్రీస్ ఎస్టేట్, జగనన్న హౌసింగ్ కాలనీ ప్రజలు మంగళవారం టిడిపి సీనియర్ నాయకులు గౌరువెంకట రెడ్డిని మరియు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి అక్కగారు మర్యాదపూర్వకంగా కలిసి కాలనీ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్బంగా కాలనీ ప్రజలు మాట్లాడుతూ దాదాపుగా 2009లో ఇచ్చిన పేదలకు ఇక్కడ 2500ప్లాట్లు మంజూరయ్యాయి.గత పది సంవత్సరాల నుంచి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు కాలువలు,ఏ అభివృద్ధికి నోచుకోలేదని,కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని ఆవేదన చెందారు. మరోవైపు వర్షాకాలంలో వర్షం పడినప్పుడు కాలనీవాసులు దాదాపుగా పది రోజులు బయటకి రాలేని పరిస్థితి నెలకొందన్నారు.వర్షపు నీళ్లతో పాటు పాములు,విషపురుగులు ఇళ్లలోకి వస్తాయన్న భయంతో జీవిస్తున్నామని చెప్పారు.కనీసం వీధిలైట్లు కూడా సరిగ్గా లేవని,రోడ్లు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు.గత ప్రభుత్వంలో కాలనీ సమస్యల పట్ల అప్పటి ఎమ్మెల్యే,నగర పాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు.ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనైనా తమ కాలనీ సమస్యలు పరిష్కరించాల ని కోరారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన గౌరువెంకట రెడ్డి తప్పకుండ కాలనీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు పద్మశాలి నాగేంద్రుడు మరియు రాము, శ్రీను, వెంకట్ రెడ్డి, నాగరాజు ,అన్వర్ భాష, మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.