దేవుని మాన్యాలకు శఠగోపం…
1 min readదేవుడి మాన్యాలు కౌలుకు తీసుకొని డబ్బులు ఎగవేత
అదే మాన్యాలను అధిక కౌలుకు ఇచ్చిన వైనం
కౌలు డబ్బులు అడిగితే ఈవో పై దౌర్జన్యం
మాన్యాల కౌలుతోనే దేవునికి దీప దూప నైవేద్యం
దేవుని మాన్యాల కౌలు సొమ్ము చెల్లించకపోతే చర్యలు తప్పవు
ప్రజల సహకారంతో ఆలయాలకు కొత్త శోభ
ఆలయ కమిటీ సభ్యులు గంగసాని శివారెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు పాత రోడ్డు వద్ద గల శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన దేవుని మాన్యాలు మండలంలోని దుగ్గన పల్లె పొలంలోని సర్వే నంబర్ 21 లో 5.50 ఎకరాలు ఉన్నాయని ఆలయ కమిటీ నిర్వహణలో ఒకరైన గంగసాని శివారెడ్డి తెలిపారు, మంగళవారం ఆయన చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, ఆలయానికి సంబంధించి దూప దీప నైవేద్యానికి సంబంధించి గతంలో ఆలయానికి దాతలు కొంత భూమిని ఇవ్వడం జరిగిందన్నారు, అయితే ఈ భూములను మూడు సంవత్సరాలకు ఒకసారి ఈవో అలాగే ఆలయ కమిటీ ద్వారా కౌలుకు వేలంపాట వేయడం జరిగిందన్నారు, ఈ తరుణంలో మండలంలోని దుగ్గనపల్లె పొలంలో గల 5.50 ఎకరాల భూమికి వేలంపాట నిర్వహించగా ఆ వేలం పాటలో ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ అయిన ఎర్ర సాని నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి కౌలుకు తీసుకోవడం జరిగిందన్నారు, మూడు సంవత్సరాలకు భాగంగా ప్రతి సంవత్సరం 80 వేల రూపాయలు చెల్లింపుతో మూడు సంవత్సరాలకు రెండు లక్షల 40 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు, అయితే ఎర్ర సాని నిరంజన్ రెడ్డి ఆ భూమిని సంవత్సరానికి 80 వేల రూపాయలకు కౌలుకు పాడుకొని సంవత్సరానికి లక్ష రూపాయలతో వేరే వారికి కౌలుకు ఇవ్వడం జరిగిందన్నారు, మొదటి సంవత్సరం 80 వేలు చెల్లించిన నిరంజన్ రెడ్డి, రెండు సంవత్సరాల కౌలును చెల్లించకుండా అతను ఇచ్చిన కౌలు దారుల దగ్గర మూడు సంవత్సరాలకు గాను మూడు లక్షలు తీసుకోవడం జరిగిందన్నారు, దేవుని మాన్యానికి సంబంధించిన రెండు సంవత్సరాలకౌలు డబ్బులను అప్పటి ఈవో నిరంజన్ రెడ్డిని అడుగగా నిరంజన్ రెడ్డి ఆయనను బెదిరించడం జరిగిందన్నారు, రెండు సంవత్సరాలు నష్టం వచ్చిందని కౌలు డబ్బులు చెల్లించలేనని ఎక్కువ మాట్లాడితే ప్రభుత్వం తమదేనని నీపై ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేస్తానని ఈవో ను బెదిరించడం జరిగిందని గంగసాని శివారెడ్డి ఆరోపించారు, ఉప్పరపల్లి కు చెందిన ఒక ఎంపీటీసీ వైసిపి లీడర్ అయిన ఎర్ర సాని నిరంజన్ రెడ్డి దేవుని మాన్యాన్ని కౌలుకు తీసుకొని ఇలా చేయడం ఎంతవరకు సమఝ్యసమని ఆయన నిలదీశారు, నిజంగా అతను ఆ భూమిలో పైరు పెట్టి నష్టపోయి ఉంటే నష్టపోయాడని అనుకునేవారు, అలాకాకుండా 80 వేల రూపాయలతో కౌలుకు తీసుకొని లక్ష రూపాయలకు ఇతరులకు కౌలుకు ఇచ్చి డబ్బులు ఎదరగొట్టేందుకు ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేను అడ్డుపెట్టుకోవడం సిగ్గుచేటు అన్నారు, దేవుని మాన్యానికి సంబంధించిన కౌలు డబ్బులు చెల్లించకపోతే దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఆయన హెచ్చరించారు.
ఇప్పటికే ప్రజల సహకారంతో శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయంలో 40 లక్షల రూపాయల నుండి, 50 లక్షల రూపాయల వరకు దేవస్థానాన్ని అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు, ఇందులో ధ్వజ స్థంభం, నవగ్రహాలు, ఉత్సవ కలశాలు, ఉత్సవ విగ్రహాలు, తో పాటు పార్వతీ, పరమేశ్వరుల కు నూతనంగా గోపురాలు నిర్వహించడం జరుగుతుందన్నారు, గతంలో ఈ దేవాలయంలో గోపురాలు లేవని ఇప్పుడు ఈ ఆలయాలకు కొత్త గోపురాలను నిర్మించడం జరుగుతుందన్నారు, ఇలా ప్రజలకు తోచిన విధంగా ఆలయాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే ఆలయాల భూములను కౌలుకు తీసుకొని ఆ భూములను తిరిగి వేరే వారికి అధిక ధరలకు కౌలుకు ఇచ్చి సొమ్ము చేసుకుని తిరిగి ఆలయాలకు చెల్లించాల్సిన సొమ్మును చెల్లించకపోగా అడిగిన పాపానికి వారిపై దౌర్జన్యం చేయడం ఎంతవరకు సబబు అని ఆయన ఉప్పరపల్లె ఎంపీటీసీ ఎర్ర సాని నిరంజన్ రెడ్డిని ప్రశ్నించారు.