PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంగళగిరిలో …ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి

1 min read

పల్లెవెలుగు వెబ్ అమరావతి:  గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు పల్నాడులో ఒక్కోక్కటిగా బయటికి వస్తోన్నాయి. పిడుగురాళ్లలో తనకు ఉన్న 2.14 ఎకరాల పొలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేయడానికి కుట్ర పన్నితే…  కోర్టులో కేసు వేయగా కోర్టు తనకే అనుకూలంగా తీర్పు ఇచ్చినా మళ్లీ ఆ భూమిలో 60 సెంట్లకు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి వైసీపీ నేత తరుక కిషోర్ భూమిని కబ్జా చేశాడని.. అధికారుల వద్దకు వెళ్లినా పట్టించుకోలేదని.. తనకు న్యాయం చేయాలని సాంబయ్య విజ్ఞప్తి చేశాడు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్, నేతలు ప్రభాకర్ చౌదరి, నరసింహ ప్రసాద్ లను కలిసి వినతిపత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి తరలి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను చెప్పుకోగా గ్రీవెన్స్ లో ఉన్న నేతలు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో సమస్యలను పరిష్కరించాలని ఫోన్ చేసి చెప్పారు. పరిష్కరించతగిన అర్జీలకు వెంటనే పరిష్కార మార్గాన్ని చూపి అర్జీదారులను ఆ విషయాన్ని తెలియజేశారు.  ఈ సందర్భంగా నేడు గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీలు…పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం తర్లపాడు గ్రామానికి చెందిన చింతల శేషగిరిరావు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేస్తూ.. గత వైసీపీ చేపట్టిన సమగ్ర రీ సర్వేలో ఏకపక్షంగా నిర్ణయించి తమ భూమి 30 సెంట్లను మాజీ మంత్రి విడతల రజిని అనుచరుడు మండల స్థాయి వైసీపీ నాయకుడు అనుంగుల పేరుమీదకు మార్చారని తమ భూమని తనకు ఇప్పించి న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. తమ స్థలంలో దౌర్జన్యాంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని.. అక్రమ నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు పరోక్షంగా సహకరించారని దయ చేసి తమ స్థలంలో సింగారపు గోపి తండ్రి అప్పలస్వామి కట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన గుంట సరస్వతి విజ్ఞప్తి చేశారు. విశాఖ పట్నం జిల్లా  తాటి చెట్లపాలెం సంజీవయ్య కాలీనీకి చెందిన కోరుకొండ విజయలక్ష్మీ విజ్ఞప్తి చేస్తూ.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కెకె రాజు అనుచరులు సహకారంతో కొంతమంది తమపై  కత్తులతో దాడి చేసి రక్త గాయాలైయ్యేలా కొట్టారని.. చంపేస్తామని బెదిరించి తమ ఇంటిని కబ్జా చేయడానికి చూస్తున్నారని ఆమె గ్రీవెన్స్ లో నేతల ముందు విలపించారు. అద్దె అడిగినందుకు వైసీపీ సానుభూతిపరుడైన విశ్వనాథరెడ్డి అక్రమ కేసులు పెట్టి తమ స్కూల్ ను మూయించాడని. స్కూల్ స్తాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అలాంటి ఘటనలు జరగలేదని.. గతంలో ఎన్టీఆర్, వెంకయ్య నాయుళ్లు కూడా తమ స్కూల్ ను సందర్శించారని. దయ చేసి విచారించి తమ స్కూల్ పున: ప్రారంభానికి సాయం చేయాలని  ఎన్. రవీంద్ర గౌడ్ విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా  గరివిడి మండలం నీలాద్రిపురానికి చెందిన సారిపాక నర్సమాంబ విజ్ఞప్తి చేస్తూ.. తమ భూమి 21 ఎకరాల 15 సెంట్లను రెవెన్యూ అధికారులు కబ్జాదారులతో  కుమ్మక్కై తమ భూమిని రికార్డుల్లో లేకుండా చేసి భూమిని కొట్టేయాలని చూస్తున్నారని గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు. వృద్ధాప్యంలో ఉన్న తనకు న్యాయం చేయాలని ఆమె వాపోయారు. 2019 లో వైసీపీ అధికారంలోకి రావడంతో  తాము టీడీపీ కార్యకర్తలమన్న ఉద్దేశంతో రేషన్ షాపులను గత ప్రభుత్వం తొలగించిందని..  గత ప్రభుత్వం తొలగించిన దుకాణాలను తమకు కేటాయించాలని  అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన పాత రేషన్ డీలర్లు అర్జీ అందించారు. అనంతపురం జిల్లా  అనంతపురం అర్బన్  లోని చెన్నకేశవ ఆలయానికి ఆనుకోని అంబారపు వీధిలో ఉంటున్న పలువురు పేదలు విజ్ఞప్తి చేస్తూ.. 100 సంవత్సరాల నుండి చెన్నకేశ స్వామి ఆలయానికి ఆనుకోని నివాసం ఉంటున్నా గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులు తమను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని.. తమ సమస్యను పరిష్కరించి ఉంటున్న స్థలాలను రిజిస్టర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తమ పొలానికి దారిలేకుండా చేసి తమను పొలంలోకి వెళ్లకుండా అంకిరెడ్డి పల్లెకు చెందిన కొత్తకోట రోశయ్య చేస్తున్నాడని… దాంతో తమ పొలం బీడు పెట్టాల్సి వస్తోందని  ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ పంచాయతీకి చెందిన బిజ్జం తిరుపాల్ రెడ్డి గ్రీవెన్స్ లో వాపోయారు వాపోయారు.   గత ప్రభుత్వంలో జరిగిన నియామకాల్లో చాలా అవకతవకలు జరిగాయని.. అందులో భాగంగా పీఎచ్ సీ, సీఎచ్ సీ, లతో పాటు డీహెచ్ లలో నియమించిన ల్యాబ్ టెక్సీషియన్ ల ఉద్యోగాలను నకిలీ దృవపత్రాలతో పొందారని 2020 నుండి 2023 మధ్య  నకిలీ పత్రాలతో అర్హత పొందిన వారిని చర్యలు తీసుకోవాలని కిరణ్ కుమార్ గ్రీవెన్స్ లో కోరాడు. ఇబ్రహీంపట్నం రామకృష్ణ అనే వ్యక్తి క్వారినీ 2019 లో టీడీపీ అధికారం పోయిన వెంటనే వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారని.. svec క్రసర్ కు చెందిన వైసీపీ నేతలు తమను క్వారీలోకి అడుగు పెట్టనివ్వలేదని.. గత 30 సంవత్సరాల నుండి క్వారీ తమ ఆధీనంలోనే ఉందని వాపోయాడు. దయ చేసి వైసీపీ నేతలు ఆక్రమించుకున్న క్వారీని ఇప్పించాలని వేడుకున్నాడు.వినుకొండలో ఉన్న తన భూమి ఒక ఎకరా తొమ్మిది సెంట్లను  లోకల్ రౌడీ షీటర్లు కబ్జా చేశారని.. ఒంగోలుకు చేందిన షేక్ జిలానీ భాషా గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశాడు.  వీటితో పలువురు నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు కల్పించాలని రాగా.. ఫించన్ కల్పించాలని మరికొందరు లబ్దిదారులు వేడుకున్నారు. నామినేటెడ్ పదవుల కోసం నేతలు వినతులు ఇచ్చారు.  సీఎం రిలీఫ్ ఫండ్, విదేశీ విద్యాకానుక, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఇలా అనేక వినతులు గ్రీవెన్స్ కు పోటెత్తాయి. వచ్చిన వినతులను సంబంధిత మంత్రులు, అధికారులకు పంపించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని మంత్రి టి.జి భరత్ కోరారు.

About Author