బాల కార్మికులతో పనిచేస్తే కఠిన చర్యలు..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: దుకాణాలు, మెకానిక్ షాపుల్లో చిన్న పిల్లలతో పనిచేయిస్తే కఠిన చర్యలు తప్పవని కార్మిక సహాయ అధికారి మురళీకృష్ణ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రం గడివేములలో బాల కార్మిక నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా వివిధ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. బాలకార్మి కులతో పనులు చేయిస్తున్న యజమానులకు హెచ్చరించి, సూచనలు చేశారు. చిన్నపిల్లలతో పనులు చేయించకుండా బడుల్లో చేర్పించాలన్నారు. వివిధ షాపుల్లో పనిచేస్తున్న బాల కార్మికులతో పనిచేస్తున్న షాపు యజమానులకు నోటీసులు జారీ చేశారు. కార్యక్రమంలో కార్మికశాఖ సిబ్బంది సమీర్ తదితరులు పాల్గొన్నారు.