రెప రెపలాడిన త్రివర్ణ పతాకం..
1 min read-సీఎస్ఐ పాఠశాలలో తాటిపాటి రమేష్,పరమేష్
-జనసేన కార్యాలయంలో సమన్వయకర్త రవికుమార్ జెండా ఆవిష్కరణ..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మిడుతూరు రహదారిలో ఉన్న సీఎస్ఐ పాఠశాలల్లో ఎలిమెంటరీ పాఠశాల చైర్మన్ మాధవరం పరమేష్,ఎయిడెడ్ పాఠశాలలో తాటిపాటి రమేష్ త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు. స్వాతంత్ర సమరయోధులు ఎందరో త్యాగ ఫలితంగానే మనం ఈ రోజున జాతీయ జెండాను ఆవిష్కరించామని 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చిందని ఈ స్వాతంత్రం రావడానికి అప్పటి స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది పోరాటాలు చేసి జైలు పాలు అయ్యారని అంతే కాకుండా వారిని చిత్ర హింసలకు గురి చేశారని పాఠశాలల చైర్మన్లు తాటిపాటి రమేష్ మాధవరం పరమేష్ విద్యార్థులకు సందేశం తెలియజేశారు.అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భరత్ భూషణం,సుధాకర్ లతో కలసి చైర్మన్లు బహుమతులను ప్రధానం చేశారు.అదేవిధంగా పట్టణ మున్సిపాలిటీలో కమిషనర్ సుధాకర్ రెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి జెండాను ఎగరవేశారు.అంతేకాకుండా పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో మరియు కళాశాలల్లో జెండాను ఎగురవేసిన అనంతరం విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.విద్యార్థులకు బహుమతులు మరియు స్వీట్లు అందజేశారు.తర్వాత జనసేన పార్టీ కార్యాలయంలో నందికొట్కూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నల్లమల రవికుమార్ పార్టీ కార్యకర్తలతో కలిసి జెండాను ఎగరవేశారు.ఒకరినొకరు స్వీట్లు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో జనసేన ప్రవీణ్ భక్తుల కిరణ్,గుడిపాడు ప్రభాకర్,మాధవరం రాజు తప్పెట రాజశేఖర్ అశోక్ సోషల్ మీడియా జలీల్ లక్ష్మీనారాయణ వనమన్న పాల్గొన్నారు.