జమాతే ఆహా లే హదీస్ యువజునుల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: జమాతే ఆహా లే హదీస్ యువజునుల ఆధ్వర్యంలో గురువారం భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక తీరుబజారు లో జాతీయ జెండాను ఎస్సై పెద్దయ్య నాయుడు ఎగరవేశారు మండల టిడిపి కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య మాట్లాడుతూ సర్వేంద్రియానామ్ నయనం ప్రధానం అని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యంగా ఎదగాలని విజ్ఞప్తి చేశారు కంటి చూపు కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని ప్రజలకు పిలుపునిచ్చారు రక్తదానం ఇవ్వడం వల్ల అత్యవసరాల్లో మరొక ప్రాణాన్ని కాపాడినట్లు అవుతుందని పేర్కొన్నారు జమాతే ఆలే హదీస్ యువత జమాత్ మరెన్నో సేవా కార్యక్రమాలను ముందు నడిపించాలని తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు ఎస్సై పెద్దయ్య నాయుడు మాట్లాడుతూ అహలె హదీస్ జమాత్ యువకులు కేవలం పట్టణ ప్రాంతానికి పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు కార్యక్రమాలు కొనసాగించాలని యువత సేవ కార్యక్రమం చేయడం పట్ల అభినందించారు రాష్ట్ర తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి చిన్నహేట శేషగిరి మాట్లాడుతూ అందరి సహకారంతో అహలే హదీస్ జమాత్ యువకులు ఉచిత వైద్య శిబిరం కొనసాగించడం గొప్ప విషయం అని ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఉచిత వైద్య శిబిరంలో రక్తదాన శిబిరాన్ని ఎస్సై పెద్దయ్య నాయుడు ప్రారంభించారు కార్యక్రమంలో మండల టిడిపి కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి చిన్న హాట శేషగిరి, టిడిపి నాయకుడు తోక వెంకటేష్, ఏపీ వి బి పి జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్, వార్డ్ మెంబర్ అబ్దుల్ హమీద్, సిపిఐ మండల కార్యదర్శి పెద్దహేట మారెప్ప, రక్తదాన క్యాంప్ ఆఫీసర్ జగన్, ఆలే హదీస్ ముతా వల్లీలు ముల్లావల్లి, అల్లా బక్షి, జమాత్ పెద్దలు అబ్దుల్లా సాబ్, లుక్మాన్ సాబ్, ఆలే హదీస్ యువజన సభ్యులు అబ్దుల్ రెహమాన్, కనికట్ అమన్, రిజ్జు, ఖాదర్ బాషా, అమీర్ మావియా, షౌకత్, ముధసిర్, ఫర్హాన్, జమాత్ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.