మాదక ద్రవ్యాల నిర్మూలన చట్టంపై అవగాహన సదస్సు
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలోని రావుస్ డిగ్రీ కళాశాల నందు గురువారం మాదక ద్రవ్యాల దుర్వినియోగం, విద్యా చట్టాలు మరియు మాదక ద్రవ్యాల నిర్మూలన చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సు, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి సాయి సుభాష్ ఎం. ఎల్ గారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం ఎమ్మిగనూరు నందు లేదని, ఒకవేళ ఎవరైనా వినియోగానికి పాలు పడితే చట్టపరంగా శిక్షలు పడతాయని, అట్టి వారిని తల్లి తండ్రులు కానీ, పోలీసులు కానీ, న్యాయ వాదులు కానీ రక్షించలేరని తెలిపారు. ముఖ్యంగా తోటి విద్యార్థులు స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉంటూనే మనలని మాదక ద్రవ్యాలకు అలవాటు చేస్తారు, అలాంటి వారికి దూరంగా ఉంటూ, చట్టానికి సాహాయంగా ఉండాలని, అల మత్తు పదార్థాలకు బానిసలుగా ఉంటూ జీవితాన్ని నాశనం చేసుకునే వారికి దూరంగా ఉండాలి కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ముఖ్యంగా మత్తు పదార్థాలకు అలవాటు పడి, ఎటువంటి పని ఐన చేయగలిగే స్థాయికి, చివరకు దానికోసం ప్రాణాలను సైతం పోగొట్టుకున్న వారు ఉన్నారని, ఎవరైనా అటువంటి ఆలోచనలు ఉన్న, మనకు తెలిసిన వెంటనే సమాచారం ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో వారికి అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు అని శ్రీ సుదర్శన రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎమ్మిగనూరు వారు తెలిపారు. అటువంటి సమాచారం తెలుసుకున్న వారు మనకు ఎందుకు అని ఉండకుండా, పోలీసు అధికారులకు, కోర్టు వారికి, మండల న్యాయ సేవ కమిటీకి సమాచారం ఇవ్వాలని కోరారు. మాదక ద్రవ్యాల వినియోగం మరియు నిర్మూలన చట్టంనుద్దేశించి పలువురు న్యాయవాదులు శ్రీ ఎం. కే. గురు రాజ రావు, న్యాయ వాదులు సంఘం అధ్యక్షులు, శ్రీ రఘు రాం, కార్యదర్శి, న్యాయ వాదులు సంఘం, శ్రీమతి విమల, శ్రీ మురళీ కృష్ణ, శ్రీ లింగమూర్తి న్యాయవాదులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి శ్రీ సాయి సుభాష్, గారు, కుమారి అర్చన, జూనియర్ సివిల్ జడ్జి గారు, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గురు రాజ రావు, కార్యదర్శి శ్రీ రఘురాం, కోశాధికారి మురళీకృష్ణ పలువురు న్యాయవాదులు గోపాల కృష్ణ, సురేష్, ఎల్కూరి గురు న్యాయ వాదులు, ఇతర కోర్టు సిబ్బంది సుధాకర్, కోర్ట్ కానిస్టేబుల్ రామాంజనేయులు, శ్రీమతి మహేశ్వరి మండల న్యాయ సేవాఅధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.