పోరాట యోధుల త్యాగఫలమే.. స్వాతంత్ర్యం..
1 min readవిద్యార్థులు ఉత్తమంగా చదవాలి
- ప్రముఖ గ్యాస్ర్టో ఎంట్రాలజిస్ట్ డా. శంకర్ శర్మ
కర్నూలు, పల్లెవెలుగు:78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కర్నూలు లో ఘనంగా నిర్వహించారు. కేంద్రీయ విద్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిధిగా పాల్గొన్న డాక్టర్ శంకర్ శర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కెంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ పాయాల్ ప్రియదర్శిని తో కలిసి డాక్టర్ శంకర్ శర్మ కోకో, వాలీబాల్ కోర్టులను ఆవిష్కరించి మొక్కలు నాటారు. ఈసందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల కృషి వల్లే నేడు మనమందరం స్వేచ్చా జీవితాన్ని అనుభవిస్తున్నాం అన్నారు. స్వాతంత్ర్య సమరయెధుల గొప్పతనాన్ని డాక్టర్ శంకర్ శర్మ విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే దేశభక్తిని కలిగిఉండాలన్నారు. ప్రిన్సిపాల్ ప్రియదర్శని మాట్లాడుతూ డాక్టర్ శంకర్ శర్మ ఆర్థిక సహయ సహకాలు, విద్యార్థుల పట్ల సేవనిరతి ప్రసంశనియమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఫలాలను అందిపుచ్చుకునే భాద్యత గల పౌరులు గా ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. చిన్నారులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చిన్నారులు దేశభక్తి గీతాలకు డ్యాన్స్ చేసి అలరించారు.