విద్యార్థులకు చెక్కులను అందించిన మిక్కిలినేని ప్రసాద్
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోళగుంద, మండల కేంద్రం హోళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 2023-24 విద్యా సంవత్సరం నందు పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పారిశ్రామికవేత్త మిక్కిలినేని ప్రసాద్ నగదుకు సంబంధించిన చెక్కులను అందజేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజీర్ అహ్మద్ అధ్యక్షతన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ సర్పంచ్ రాజా పంపన గౌడ, పాఠశాల యాజమాన్య కమిటీ నూతన సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిక్కిలినేని ప్రసాద్ మాట్లాడుతూ నా కుమార్తె దీప్తి ఆదేశాల మేరకు పదవ తరగతి పరీక్షల్లో మొదటి బహుమతి కాకి అక్షయకు 50వేల నగదు, సింధుజకు 30 వేల నగదు, ముస్కాన్ కు 20వేల నగదును చెక్కుల ద్వారా నగదును అందజేయడం జరిగిందని అన్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు ఘనంగా సత్కరించారు.అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కొనసాగిస్తానని ఆయన అన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, పాఠశాలకు, ఉపాధ్యాయులకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా నా వంతు సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,పాఠశాల వైస్ చైర్మన్ చిట్టెమ్మ,నాయకులు అబ్దుల్ సుభాన్,కాకి సీతయ్య, దుర్గాప్రసాద్, శాలి మహబూబ్ బాషా, మోయిన్,తదితరులు పాల్గొన్నారు.