ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎంపీ శబరి..
1 min readఎంపీ కి సర్పంచ్ నాగిరెడ్డి..ఉప సర్పంచ్ శివారెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడుబంగ్లా మండల పరిధిలోని తర్తూరు గ్రామంలోని ప్రముఖ వైష్టవ దేవాలయంలో వెలసిన శ్రీ రంగనాథస్వామి ఆలయంలో నంద్యాల పార్లమెంట్ సభ్యులు,లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.ఈ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ లోనే మొదటి మహిళా ఎంపీగా గెలుపొందిన బైరెడ్డి శబరి మొదటి సారిగా శనివారం ఉదయం గ్రామానికి వచ్చిన ఎంపీ శబరికి తర్తూరు గ్రామ సర్పంచ్ పీఎం నాగిరెడ్డి,గ్రామ ఉప సర్పంచ్ శివారెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది గ్రామస్తులు డప్పు,తప్పేట్ల వాయిద్యాలు,మేళతాల నడుమ ఎంపీ కి పూలతో అపూర్వ ఘన స్వాగతం పలికారు.ఎంతో పురాతన చరిత్రగల మహిమానితుడు తర్తూరు శ్రీ రంగనాథస్వామిని శ్రావణ శనివారం బైరెడ్డి శబరి దర్శనం చేసుకొని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో ఎంపీ శబరికి స్వాగతం పలికి స్వామి వార్లకు శబరితో ప్రత్యేక పూజలు చేయించి తీర్థం ప్రసాదం అందించి శేష వస్రంతో సన్మానించి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి నాగేశ్వరావు,టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి,మురళీధర్ రెడ్డి బంగారం వెంకటేశ్వర్లు, కరుణాకర్ రెడ్డి,గుణశేఖర్ రెడ్డి, పాములపాడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.