విద్యార్థులు భావిభారత పౌరులుగా ఎదగాలి… సీఐ పురుషోత్తం రాజు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి బావి భారత పౌరులుగా ఎదగాలని సీఐ పురుషోత్తం రాజు అన్నారు, జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మండలంలోని కొండపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థులకు ఫోక్సో యాక్ట్ , పిల్లల భద్రత, బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్, డయల్ 100, రోడ్డు భద్రత నియమాలు, సోషల్ మీడియా అలాగే సైబర్ నేరాల, పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన విషయాలపై అవగాహన కల్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో ఉన్నత విద్యను ఆభ్యసించి అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు, విద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగేందుకు ఉపాధ్యాయులు చక్కటి విద్యతోపాటు వినయ విధేయతలు నేర్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు, అలాగే విద్యార్థులు విద్యార్ధి దశ నుండే సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉంటూ మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు, అందరూ బాగా చదువుకుని సమాజానికి, దేశానికి సేవ చేయాలని ఆయన తెలియజేశారు, విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశల్ని, ఆశయాలను నెరవేర్చేలా మీ వంతు కృషి చేసి విజయం సాధించాలని ఆకాంక్షించారు. దేశ భవిష్యత్తు విద్యార్థులపై, యువతపై ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకుని నడుచుకోవాలని ఆయన విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు, ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ లు సుబ్బయ్య, సుధాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.