ఆగస్టు 23న ‘ఉపాధిహామీ’ గ్రామసభలు : డీపీఓ నాగరాజ నాయుడు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ , జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 23న ప్రతి గ్రామపంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన గ్రామసభలు నిర్వహించాలని డీపీఓ నాగరాజ నాయుడు ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆయా గ్రామసభల్లో సర్పంచ్, వార్డు సభ్యులు, రైతులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులతో పాటు ఉపాధి కూలీలు, గ్రామాల్లో పనిచేస్తున్న ఆయా శాఖల సిబ్బంది పాల్గొనాలని తెలిపారు. ఇప్పటిదాకా ఈ పథకం ద్వారా గ్రామంలో చేసిన పనుల వివరాలను, అదేవిధంగా 2024-25 వ ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న పనులకు గ్రామసభ ఆమోదం తీసుకుంటారని చెప్పారు. కనక ప్రతి గ్రామంలో గ్రామసభను నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులను ఆయన ఆదేశించారు.