ఆత్మకూరు పట్టణంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలో ఘనంగా 185 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఆత్మకూరు ఫోటోగ్రఫర్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఆత్మకూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ లో ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఆత్మకూరు పట్టణ మరియు పరిసర గ్రామాల ఫోటోగ్రాఫర్లు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డ్యాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరు కేకు స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ యూనియన్ ప్రెసిడెంట్ శివ గౌడ్ మాట్లాడుతూ, ఫోటోగ్రఫీ అనేది 100 మాటలకు సమాధానమని ఇంతమంది ఫోటోగ్రాఫర్లకు జీవన వృత్తి అయిన ప్రోటోగాపర్లకు రుణాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. అలాగే ఫోటోగ్రాఫర్ పల్లె చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఫోటోగ్రఫీ వృత్తి వల్ల కొన్ని లక్షల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని ఫోటోగ్రఫీ అనేది మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫోటోగ్రాఫర్లు కిట్టు, నారాయణ,రంగస్వామి, అశ్వక్,మధు, శ్రీహరి, నజీర్, తదితరులు పాల్గొన్నారు.