ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: శ్రీ రాజరాజేశ్వరి పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు అంగరంగ వైభవంగా పాఠశాల కరస్పాండెంట్ యం. రామేశ్వర రావు చేతులమీదుగా సోమవారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్, రాఖీగా పిలవబడే ఈ పండుగ సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకునే పండుగ అని సోదర సోదరీమణులు ఒకరికి ఒకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. సోదరీ తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడు అన్న తనకు రక్షగా, తాను అన్నకు అండగా ఉండాలని . సోదరి కట్టిన రక్షాబంధాన్ని స్వీకరించిన అన్న తాను ఎప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని రక్షాబంధనం ద్వారా తెలియజేస్తారనీ. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను మా పాఠశాలలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తామన్నారు ప్రధానోపాధ్యాయులు యం. రామేశ్వర రావు రాఖీ పండుగ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ యం. బి. యన్. రాఘవేంద్రరావు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.