PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూనియర్ డాక్టర్ మౌనిక కు న్యాయం జరగాలని ఎస్ఎఫ్ఐ అవగాహన సదస్సు

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : కోల్కతాలో వారం  క్రితం ట్రైనీ వైద్యారాలి పై అత్యాచారం, హత్య ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని, పీజీ విద్యార్థిని మౌనిత దెబ్నత్  కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, SFI మద్దికేర మండల కమిటీ ఆధ్వర్యంలో మద్దికేర మండలంలో స్థానిక కెవిఆర్ గర్ల్స్ స్కూల్ నందు  అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉన్నత విద్యాధికారి రంగస్వామి , మండల వైద్యాధికారిని రాగిణి, మండల  హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అగ్బర్ భాష , పాఠశాల ప్రధానోపాధ్యాయుడు  దేవేంద్రప్ప లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జూనియర్ డాక్టర్లకు రక్షణ కల్పించాలని, మౌనిత దెబ్నత్ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాలకు సూచించారు. అలాగే దేశంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చట్టాలను మరింత బలంగా ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే విద్యార్థినిలు సమాజంలో జరుగుతున్న ఇలాంటి ఘటనలు తెలుసుకొని ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని, సూచించారు .  ఈ సందర్భంగా SFI జిల్లా ఉపాధ్యక్షులు  కడవల రవి కుమార్ మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఆఖరికి ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్లకు ఆసుపత్రిలో రక్షణ లేకుండా పోతోందన్నారు. విధుల్లో ఉన్న డాక్టర్లే అత్యాచారానికి గురవుతుంటే దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధమవుతుందని అన్నారు. ఇదేనా స్వాతంత్ర్యం అని ప్రశ్నించారు. విధుల్లో ఉన్న  డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో SFI ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  SFI మండల అధ్యక్షుడు తరుణ్, ఆదాం, మహానంది తదితరులు  పాల్గొన్నారు.

About Author