ప్రపంచ దోమల దినోత్సవం …
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు : ప్రపంచ దోమల దినోత్సవం” సందర్భముగా కర్నూలు పట్టణం A క్యాంపు నందలి మాంటిసోరి స్కూల్ నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి డా.యల్. భాస్కర్ ఆధ్వర్యములో అవగాహన సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమములో వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగష్టు 20 వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకొంటున్నామని అందులోభాగంగా ఈ సంవత్సరం “దోమల రహిత సమాజం – ఆరోగ్యానికి సోపానం ” అను నినాదంతో నివారణ మరియు నియంత్రణ చర్యలు చేపడుతున్నామని వారు తెలిపారు. పూర్వం చెడు గాలి వలన మలేరియా జ్వరం వస్తుందని భావించేవారని, 1897 ఆగష్టు 20 వ తేది “సర్ రోనాల్డ్ రాస్” మలేరియా వ్యాది ఆడ అనాఫిలిస్ దోమల వలన వ్యాప్తి చెందుతుందని కనుగొన్నాడని తెలిపారు. కాబట్టి దోమలను పుట్టకుండా చూద్దాం – దోమలను కుట్టకుండా చేద్దాం అని ప్రజలకు అవగాహన కల్పించి దోమలవలన కలిగే మలేరియా, డెంగ్యూ , చికున్ గున్యా , భోదకాలు మరియు మెదడు వాపు వ్యాది నివారించవచ్చునని పిలుపునిచ్చారు.
నివారణ చర్యలు: దోమ తెరలు వాడడం,పొడుగు గల దుస్తులు ధరించడం,నీరు నిల్వ లేకుండా చేసుకోవడం.డ్రై డే పాటించడం.ఈ కార్యక్రమం లో జిల్లా మలేరియా అధికారి నూకరాజు గారు , బయాలజిస్ట్ వెంకటేశ్వర్లు , DEMO శ్రీనివాసులు , AMO చంద్రసేకర్ , డిప్యూటీ డెమో చంద్రసేఖర్ రెడ్డి , వైద్యాధికారులు డాక్టర్ మాధవి , కళాశాల డైరెక్టర్ రాజశేఖర్ , ప్రిన్సిపల్ శ్రీ జ్యోతి , HM రామ జ్యోతి , ప్రాజెక్సనిస్ట్ ఖలీల్ , ఆరోగ్య కార్యకర్తలు , ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.