PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఔట్సోర్సింగ్ . అప్రెంటిస్ ట్రైనింగ్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించాలి

1 min read

… ఏపీటీఎఫ్..

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్:  ఎస్. టి. ఎఫ్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నేనావత్ రాము నాయక్ మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో  దాదాపు 19 సంవత్సరాల నుండి ఔట్సోర్సింగ్ మరియు అప్రెంటిస్ ట్రైనీ విధానంలో ఉద్యోగులు వర్క్ ఇన్స్పెక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐసీలు, అటెండర్లు ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్రంలో దాదాపు 2500 మంది గృహ నిర్మాణ సంస్థ లో విధులు నిర్వహిస్తున్నారని హౌసింగ్ లో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు టైం స్కేల్ వర్కర్లు లేదా ఎన్ఎంఆర్లుగా మాకు క్రమబద్దించకరించాలని కొత్త ప్రభుత్వంలో  తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు . హౌసింగ్ లో రెగ్యులర్ ఉద్యోగులు దాదాపు 90% రిటైర్ అయ్యారు, పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. కావున దయచేసి కాళీ పోస్టులకు మాకు రెగ్యులర్ ద్వారా తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి కోరుతున్నాము. మేము 19 సంవత్సరాల నుంచి చాలీచాలని జీతాలతో సంస్థలో బండెడు భారాన్ని మోస్తూ గృహ నిర్మాణాల పురోగతికి పాటుపడుతున్నట్టు. అయినా కూడా మా శ్రమకు మాత్రం తగిన ఫలితం గుర్తింపు రావడం లేదు. గ్రౌండ్ వర్క్ నుంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగులే కీలకమైన పాత్ర వహించి పనిచేయవలసింది ఉంటుంది. ఎప్పటికైనా మాకు రెగ్యులర్ అవుతాయన్న నమ్మకంతో పని భారాన్ని మోస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో మాతో బండేడు పని భారం చేపించి మాకు రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి మాకు ఎటువంటి న్యాయం చేయక మా కుటుంబాలకు అన్యాయం చేసింది పోయిన ప్రభుత్వం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మా ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.మా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రతి పనిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎంఏవై) వంటి కేంద్ర పథకం అమలు చేయటంతో పాటు, రాష్ట్ర భాగస్వామ్యంతో పథకాలను పేదల ఇళ్ల నిర్మాణాలను గ్రౌండ్ చేయటం క్షేత్రస్థాయిలో పురోగతి ఉండేలా అనేక సాంకేతిక అంశాలను ఔట్సోర్సింగ్ ఉద్యోగులే పని చేస్తున్నాము. గత ప్రభుత్వం మా గోడు విన్నవించలేదు కావున ఇప్పటికైనా మా శ్రమను గుర్తించి మాకు టైం స్కేల్ గాని ఎన్ఎంఆర్లుగా ప్రకటించాలని కోటి ఆశలతో మన కూటమి ప్రభుత్వానికి కోరుతున్నాము.ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం కార్యదర్శులు ఎస్. నాగరాజు,డుమావత్ హనుమాన్ నాయక్, భూక్య లక్ష్మణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

About Author