భారీ వర్షాలు… శ్రీశైలం జలాశయం వరద నీటితో పెన్నా నది జలకళ
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: పెన్నా నది ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో పాటు శ్రీశైలం జలాశయం వరద నీరు తోడవడంతో కుందు నది ద్వారా వస్తున్న వరద నీరు చెన్నూరు వద్ద జలకళ సంతరించుకుంది. మంగళవారం పెన్నా నదిలో 13 వేల 100 క్యూసెక్కులు వరద నీరు దిగువనున్న సోమశిల జలాశయంలోకి పరుగులు పెడుతున్నది. సోమవారం పెన్నా నది ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో వర్షపు నీరు కూడా చేరుతున్నది. ఆది నిమ్మాయిపల్లి ఆనకట్ట వద్ద కేసీ కెనాల్ అధికారులు కడప చెన్నూరు కాలువలకు 150 క్యూసెక్కుల నీరు సాగునీటికి వదులుతున్నారు. గత 20 రోజులుగా శ్రీశైలం జలాశయం నుంచి కుందూ నది ద్వారా పెన్నా నదిలో కి చేరడంతో పెన్నా నది ద్వారా సోమశిల జలాశయంలోకి భారీగా నీరు చేరుతున్నది. ప్రతిరోజు ఒక్క టీఎంసీ చొప్పున నీరు సోమశిల జలాశయంలోకి చేరుతున్నట్లు అధికారులు లెక్కలేస్తున్నారు. పెన్నా నదిపై నిర్మించిన ఆదినిమ్మాయిపల్లి ఆనకట్ట వద్ద కేసీ కెనాల్ అధికారులు. చెన్నూరు పెన్నా నది వద్ద సెంట్రల్ వాటర్ కమిషనర్ సిబ్బంది నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు.