జె ఏస్ డబ్ల్యూ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : గడివేముల మండలంలో బిలకలగూడూరు గ్రామంలో మంగళవారం ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్, నాబార్డ్, నవ యూత్ అసోసియేషన్ సంస్థ మరియు జెఎస్డబ్ల్యు పరిశ్రమ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రైతులకు పాడి పరిశ్రమల అభివృద్ధి చేయడమే ముఖ్య ధ్యేయంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏయూహెచ్ ఏడి పాణ్యం డాక్టర్ కరుణాకర్, గడిగరేవుల పశు వైద్యాధికారి డాక్టర్ పావని గడివేముల పశువైద్యాధికారి సాయి హరిణి, డాక్టర్ బాబా ఫక్రుద్దీన్ పాల్గొన్నారు. పాడి పరిశ్రమ రైతులు ఒక సంఘంగా ఏర్పడితే వారికి కావలసిన దాన ఎరువులు, మెడిసిన్ సబ్సిడీలో వస్తాయని రైతులకు సూచించారు. రైతులకు పాడి పరిశ్రమల అభివృద్ధిపై పలు సూచనలు అందజేశారు. అనంతరం పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా120 పశువులకు టీకాలు వేశారు.45 పశువులలో గర్భకోశ వ్యాధులకు వైద్యము అందించారు, అనారోగ్యం కలిగిన పశువులకు మినరల్ మిక్సర్ దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. సెప్టెంబర్ 19వ తేదీ వరకు గాలికుంటు వ్యాధి సోకకుండా పశువులకు టీకాలు వేస్తారని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎస్ఎ రఫిక్, జయంత్ రెడ్డి, నబి రసూల్, నవ యూత్ అసోసియేషన్ డైరెక్టర్ నరసింహులు, గొర్రెల సంఘం అసోసియేషన్ డైరెక్టర్ యుగంధర్, పశు వైద్య సిబ్బంది మరియు పసుపు పెంపకం రైతులు పాల్గొన్నారు.