శాంతి సమ సమాజ స్థాపనే- మానవతా సేవ సంస్థ ధ్యేయం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : శాంతి సమ సమాజ స్థాపనే ధ్యేయమని మానవత సేవా సంస్థ కేంద్ర డైరెక్టర్ ఏ. రామాంజనేయులు రెడ్డి తెలిపారు. మానవత సంస్థ వారోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక శ్రీ సీతారామ నామ క్షేత్రం నుండి చెన్నూరు పాత బస్టాండ్ వరకు ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలసి శాంతి ర్యాలీ నిర్వహించారు, అనంతరం పాత బస్టాండ్ నందు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర డైరెక్టర్ ఏ.రామాంజనేయులు రెడ్డి మాట్లాడుతూ, 2004 సంవత్సరంలో పశ్చిమగోదావరి జిల్లాలో మానవతా సేవా సంస్థ ఆవిర్భవించడం జరిగిందన్నారు. ఆ సంస్థ నేడు రాష్ట్రవ్యాప్తంగా 119 శాఖలుగా విస్తరించి అరవై తొమ్మిది వేల మంది సభ్యులు గా చేరి శాంతి సమా సమాజ స్థాపనే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఐ పురుషోత్తమ రాజు మాట్లాడుతూ, మానవ విలువలు దిగజారి పోతున్న నేటి సమాజంలో మానవత సేవ సంస్థ ద్వారా ఒక విలువలతో కూడిన సరికొత్త సమాజం కొరకు సంస్థ సభ్యులు పాటుపడడం జరుగుతుందన్నారు. స్వార్థమే ద్యేయంగా నడుస్తున్న నేటి సమాజంలో నిస్వార్థంగా ప్రజా సేవే లక్ష్యంగా మానవత సేవా సంస్థ ద్వారా ఒక విలువలతో కూడిన సరికొత్త సమాజ నిర్మాణం కొరకు పనిచేస్తున్న మానవత్వం కలిగిన ప్రతి ఒక్క సభ్యులను ఆయన అభినందించారు, మానవతా సేవా సంస్థ లో మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరు సభ్యులుగా చేరి ఒక నూతన సమాజ మనమే లక్ష్యంగా పాటుపడాలని ఆయన తెలిపారు. కష్టాలలో ఉన్న ప్రజల కన్నీరు తుడచి వారి కష్టాలలో పాలుపంచుకోవడమే మానవత సేవ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన తెలియజేశారు. మానవత సేవ సంస్థ మండల అధ్యక్షులు బసిరెడ్డి మాట్లాడుతూ, మానవతా సేవా సంస్థకు ఎంతోమంది తమ సేవలను అందించడం జరుగుతున్నదని అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, రక్తదాన శిబిరాలు, బాడీ ఫ్రీజర్లు, శాంతిరథాలు, అంబులెన్స్ సౌకర్యాలు, అలాగే వివిధ పరీక్షలలో మెరిట్ సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు వంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, కార్యదర్శి రామ సుబ్బారెడ్డి, కల్లూరి విజయభాస్కర్ రెడ్డి, ఇంది రెడ్డి శివారెడ్డి, ఆకుల ప్రసాద్ బాబు, శ్రీనివాసరాజు, చాణక్య,ఆటో బాబు, ప్రతాపరెడ్డి ,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.