జేఎం తాండ పాఠశాలలో నన్నే కాధం వినూత్న ప్రోగ్రాం ఏర్పాటు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ మండలం జే.యం. తాండ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి కుమారి విద్యార్థుల అవసరాల కోసం నన్నే కాదం అనే వినూత్న ప్రోగ్రాం ను ప్రవేశపెట్టి అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నారు. పాఠశాలలో పిల్లలకు నిత్యం అవసరమయ్యే బుక్స్, పెన్నులు, బలపాలు, రబ్బరు, రిమైండర్, పెన్సిల్లు పలకలు తదితరాలు పాఠశాలలోనే అందుబాటులో ఉండే విధంగా నన్నే కాదం… అడుగు ముందుకు అనే వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.జే.ఏం. తండా పాఠశాలలోనే విద్యార్థులకు గురుకుల ఎంట్రెన్స్ మోడల్ పేపర్లను విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. అలాగే వీరిని స్ఫూర్తిగా తీసుకొని మండలంలోని హోసూరు, బుగ్గ తాండ గ్రామాల్లోని పాఠశాలల్లో కూడా ప్రధాన ఉపాధ్యాయులు అబ్దుల్ రహమాన్, సత్యనారాయణ నన్నే కాదం ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు. పిల్లలు చదువుకోవడానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాఠశాలలోనే వారికి అవసరమయ్యే బుక్స్ పెన్నులు బలపాలు పలకలు అందుబాటులో ఉంచుతారు.ఈ ప్రోగ్రాం నిర్వహణ స్వచ్ఛందంగా దాతల సహకారంతో నిరంతరం కొనసాగుతుందని ప్రధానోపాధ్యాయులు ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్క పాఠశాలలో ఏర్పాటు చేసినట్లయితే బడి పిల్లలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.