గ్రామ స్వరాజ్య పంచాయతి వ్యవస్థకు ఊపిరిపోస్తున్న గ్రామ సభలు
1 min readమనేకుర్తి గ్రామసభ కార్యక్రమంలో పాల్గొన్న బి.వీరభద్ర గౌడ్
పల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఆలూరు తాలూకాతెలుగుదేశం పార్టీ ఇంచార్జి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిబి.వీరభద్ర గౌడ్ మనరాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.నారాచంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మనరాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన గ్రామసభల కార్యక్రమంలో భాగంగా.ఈరోజు ఆలూరు మండలం మనేకుర్తి గ్రామంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇంచార్జి వర్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత జగన్ పాలనలో 5ఏళ్లుగా చీకటిలో మగ్గి పోయిన గ్రామ స్వరాజ్య పంచాయతి వ్యవస్థకు ఊపిరిపోస్తూ గ్రామ సభలను ప్రారంభించడం జరిగినది. అలాగే 2014-19మధ్య కాలంలో చెత్తనుండి సంపద తయారుచేసే కేంద్రాలను నిర్మిస్తే జగన్ రెడ్డి వాటిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్నాడు.గ్రామ పంచాయతీ రోడ్లు ఊడ్చేందుకు చీపుర్లుకూడా లేక,డ్రైనేజీలు శుభ్ర పరిచేందుకు స్థోమతులేక సర్పంచులు అప్పులుచేసి గ్రామపంచాయతీలను నిర్వహించే పరిస్థితికి తీసుకువచ్చారు.అలాగే రాష్ట్రంలో అనేకమంది సర్పంచులు అప్పులబాధ తాళలేక బ్రతుకుదెరువుకోసం ఊళ్ళువదిలి వెళ్లిపోవడం జరిగింది.కావున టిడిపి + జనసేన+బిజెపి ల కూటమి ప్రభుత్వ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి వైపుగా వడివడిగా అడుగులు వేయడంకోసం మన ముఖ్యమంత్రి వర్యులు గ్రామసభలను ప్రారంభించడం జరిగింది అన్నారు.ఈకార్యక్రమంలో ఆలూరు ఎంపీడీఓ ,ఆలూరు ఎస్ఐ, గ్రామ సర్పంచ్,అలాగే ఇతర మండల అధికారులతో పాటు మనేకుర్తి,అంగసకల్లు,ఏ. గోనేహాల్ గ్రామాల టిడిపి నాయకులు అలాగే ఆలూరు మండల టిడిపి నాయకులు అలాగే తాలూకా టిడిపి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు,వివిధ హోదాలలో ఉన్న టిడిపి జనసేన బిజెపి నాయకులు తెలుగు యువత, Itdp,Tnsf,Tntuc మరియు నందమూరి,నారా, బివీజి అభిమానులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.