జీపీలకు జీవం పోసిన సీఎం..డిప్యూటీ సీఎం
1 min read-వలసలు నివారించడానికే ఉపాధి పనులు
-ఇస్కాల ఎత్తిపోతల పథకం నుండి నీటిని విడుదల చేసిన నందికొట్కూరు ఎమ్మెల్యే
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పల్లెల్లో వలసలను నివారించడానికే ఉపాధి హామీ పథకం పనులు ఉన్నాయని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.శుక్రవారం జూపాడు బంగ్లా మండల కేంద్రంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనుల గ్రామసభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని గ్రామ పంచాయతీలకు కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జీవం పోశారని అన్నారు. మండల కేంద్రంలో చేపట్టే కూరగాయల సంత నుంచి వచ్చే ఆదాయాన్ని గ్రామపంచాయతీకి వాడుకోవాలని అంతే కాకుండా కుళాయి మరియు ఇంటి పన్నులు పంచాయతీకి వాడుకోవాలని కానీ ప్రభుత్వ ఐదు సంవత్సరాల కాలంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రాత్రి పంచాయతీ అకౌంట్ లో జమ అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఉదయానికే ఆ అకౌంట్లో నగదు మాయం చేసేవాడని అన్నారు.ఉపాధి హామీ పథకం పనులు వారు ఉన్నచోటనే గ్రామాల్లో పనులు చేసుకోవాలని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే మరియు నిరుపేదలకు పని దినాలు కల్పించాలనే సంకల్పంతో ఉపాధి పనులు పెట్టడం జరిగిందని అంతేకాకుండా పండ్ల తోటల ద్వారా రైతులు అభివృద్ధి చెందాలని రాబోయే రోజుల్లో గ్రామాల్లో చేపట్టవలసిన ఉపాధి పనుల గురించి గ్రామ సభలో చర్చించి ఆమోదించిన తర్వాతనే అధికారికంగా ఈ పనులను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. మధ్యాహ్నం పాములపాడు మండలం ఇస్కాల గ్రామంలో ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రాజు,ఏపీడీ అన్వరా బేగం,ఎంపీడీఓ నూర్జహాన్,ఎంపీపీ సువర్ణమ్మ, తహసిల్దార్ చంద్రశేఖర్ నాయక్,ఈఓఆర్డి చక్రవర్తి తదితర అధికారులు నాయకులు ప్రజలు పాల్గొన్నారు.