నీట్ పీజీ లో సత్తా చాటిన మెడిసిన్ విద్యార్థులు
1 min readప్రణయ్ రెడ్డి, రాజకుమార్
పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: వెలుగోడు పట్టణ వంశీధర నర్సింగ్ హోమ్ యాజమాన్యం డాక్టర్ శివరామిరెడ్డి, డాక్టర్ పద్మ దంపతుల కుమారుడు సి నాగ శశి ప్రణయ్ రెడ్డి నీట్ పేజీలో 12 72 ఆల్ ఇండియా ర్యాంకుతో సత్తా చాటాడు. ఈ విద్యార్థి పదవ తరగతిలో 10 బై 10 మార్కులు సాధించి, ఇంటర్మీడియట్ గుంటూరు గురుస్ కళాశాలలో చదివి స్టేట్ రెండో ర్యాంకు సాధించాడు .నీట్ లో 1440 ఆల్ ఇండియా ర్యాంకు సాధించి ఛత్తీస్గఢ్ ఎయిమ్స్ లో చేరి ఎంబిబిఎస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం వెలువడిన నీట్ పీజీ ఎంట్రన్స్ ఫలితాలలో కూడా 1272 ఆల్ ఇండియా ర్యాంకు సాధించి ప్రతిభ చాటాడు. ఈ మెడిసిన్ విద్యార్థి పీజీలో జనరల్ మెడిసిన్ లేదా రేడియాలజీ కోర్సు లో చేరుటకు ఆసక్తిగా ఉన్నాడు. వెలుగోడు పట్టణంలో వైద్య వృత్తికే వన్నెతెచ్చిన డాక్టర్లుగా పేరుపొందిన డాక్టర్ శివరామిరెడ్డి పద్మ ల కుమారుడు ప్రణయ్ రెడ్డి పీజీ అనంతరం పట్టణ ప్రజలకు వైద్య సేవలు అందించి మంచి గుర్తింపు పొందాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా వెలుగోడు పట్టణానికి చెందిన ఈ. శ్రీనివాసులు కుమారుడు ఈ .రాజ కుమార్ నీట్ పీజీ లో 8200 ఆల్ ఇండియా ర్యాంతో ప్రతిభ చాటాడు.ఈ విద్యార్థి వెలుగోడు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివి 9.7 పాయింట్లు సాధించి ఇంటర్మీడియట్లో 9 8 2 మార్కులు సాధించాడు.నీట్ లో 548 మార్కులతో 7872 ఆలిండియా ర్యాంకు సాధించి కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ పూర్తి చేశాడు.ప్రస్తుతం వెలువడిన నీట్ పీజీ ఎంట్రన్స్ ఫలితాలలో 8200 ఆల్ ఇండియా ర్యాంకు సాధించాడు . నీట్ పీజీ లో ప్రతిభ చాటిన నాగ శశి ప్రణయ్ రెడ్డిని, రాజకుమార్ ను ఆర్ఎంపీ డాక్టర్లు, బంధుమిత్రులు, పట్టణ ప్రజలు, అభినందనలు తెలిపారు.