PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి గుర్తింపు తీసుకురావాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి గుర్తింపు తీసుకురావాలని భీమ ట్రేడర్స్ అధినేత కృష్ణారెడ్డి, బయోస్టాడ్ ఇండియా కంపెనీ రీజనల్ మేనేజర్ వరప్రసాద్ రావు అన్నారు. శనివారం మండల పరిధిలోని తుంగభద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రముఖ బహుళజాతి పురుగుల మందుల కంపెనీ వారు పదవ తరగతి లో ప్రతిభ కనపరచిన విద్యార్థులకు బయోజైన్ ప్రగతి స్కాలర్షిప్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతిలో ప్రతిభ కనపరచిన పది మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ 2500 చొప్పున రూ 25 వేలు పంపిణీ చేసినట్లు తెలిపారు. రైతులకు మంచి మందులు ఇచ్చి లాభాలు వచ్చే విధంగా మందులు అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రతిభ కనపరచిన విద్యార్థులకు స్కాలర్ షిప్ లను పంపిణీ చేసి ప్రోత్సాహించడం మంచి పరిణామం అన్నారు. ఇలా విద్యార్థులకు స్కాలర్ షిప్ లను పంపిణీ చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అందరికీ మంచి గుర్తింపు తీసుకురావాలి సూచించారు. కృష్ణా రెడ్డి సహయ సహకారాలతో ఈ స్కాలర్ షిప్ లు పంపిణీ చేయడం జరిగిందని కంపెనీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సీనియర్ ఎ. ఎస్. యం. వేణుగోపాల్ రెడ్డి, సేల్స్ ఆఫీసర్ రఘు, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, కంపెనీ సిబ్బంది రవికుమార్, యం. రవికుమార్, హుస్సేన్, బాలచంద్రుడు తదితరులు ఉన్నారు.

About Author