కర్నూలు జీజీహెచ్లో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది పై సస్పెన్షన్ వేటు
1 min readఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ:
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు ఎమర్జెన్సీ విభాగానికి వచ్చే పేషెంట్లపై విధి నిర్వహణలో ఉండే ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది అంబులెన్స్ వచ్చినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై అగ్రహం వ్యక్తం చేశారు. సీసీ కెమెరా ద్వారా పర్యవేక్షణ చేసి బాధ్యులైన సెక్యూరిటీ సిబ్బంది 1.కృపాకర్, 2.శేక్షావలి 3.కుమార్ లను ఐదు రోజుల పాటు సస్పెన్షన్ చేస్తూ ఎక్స్పర్ట్ సెక్యూరిటీ ఏజెన్సీ కి ఆదేశాలు జారీ చేశారు.ఆసుపత్రిలోని అత్యవసర విభాగాలైన ఏఎంసీ మరియు క్యాజువాలిటీ, గైనిక్ విభాగాలలో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండి రద్దీ ఉండే ప్రదేశాలలో నివారణ చర్యలు తీసుకోవాలని సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశించారు. సూపరిండెండెంట్ ఆఫీస్ ద్వారా నిత్యం సీసీ కెమెరా నిఘా ఉంటుందని నిత్యం పర్యవేక్షణ చేస్తూనే ఉంటామని వైద్య సిబ్బంది, డాక్టర్లు, నర్సులు, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది ఎవరైనా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వారిపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సిబ్బందికి హెచ్చరించారు.ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బందిపై ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే విధుల నుంచి తొలగిస్తామని వారికి హెచ్చరించారు.ఈ కార్యక్రమానికి ARMO, డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ ,డా.శివబాల నగాంజన్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి,గారు తెలిపారు.