జాతీయ క్రీడ దినోత్సవం సందర్భంగా విలువిద్య పోటీలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూల్ స్పోర్ట్స్ న్యూస్ : ఆదివారం కర్నూలు నగరంలోని స్థానిక డి.ఎస్.ఎ అవుట్డోర్ స్టేడియం నందు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన విలువిద్య పోటీలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాది జి. శ్రీధర్ రెడ్డి, డి.ఎస్.డి.ఓ భూపతిరావు పాల్గొని మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఈనెల 22 నుండి 29 వరకు జాతీయ క్రీడా దినోత్సవం భాగంగా ఈరోజు విలువిద్య పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం విలువిద్య పోటీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విలువిద్య సంఘం కార్యదర్శి కే నాగరత్నమయ్య, విలువిద్య సంఘం చీఫ్ పాటర్న్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, విలువిద్య సంఘం అధ్యక్షుడు సునీల్ కుమార్, జాయింట్ సెక్రెటరీ భరత్, వంశీకృష్ణ, విలువిద్య శిక్షకులు ఈదుల బాలాజీ రెడ్డి, రాజు, క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అండర్ – 9 ఇండియన్ బో బాలుర విభాగంలో ప్రధమ ద్వితీయ స్థానంలో విమల్, ఇషాన్ నిలిచారు. అండర్ 14 ఇండియన్ బో బాలుర విభాగంలో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానంలో మల్లికార్జున, భరత్, రామ్ చరణ్ నిలిచారు. అండర్ 12 రికవర్ బో బాలికల విభాగంలో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానంలో అద్వితీ, కియానా, ఆద్య నిలిచారు. అండర్ 12 రికవర్ బో బాలుర విభాగంలో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానంలో ఇశాంత్, యోగాజ్ఞా, పార్థచంద్రా నిలిచారు.