మేజర్ ధ్యాన్ చంద్ సాధించిన విజయాలతో యువత స్ఫూర్తి పొందాలి..
1 min readజెఎస్డబ్ల్యు ప్లాంట్ నవనీత్ చౌహన్..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: క్రీడల్లో ఉన్నత స్థానంలో రాణించాలని గురువారం నాడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జెఎస్డబ్ల్యు ప్లాంట్ హెడ్ నవనీత్ చౌహన్ పేర్కొన్నారు .ఈ సందర్భంగా ఎంఈఓ విమల వసుంధర దేవి మాట్లాడుతూ హకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ పుట్టిన రోజునే జాతీయ క్రీడ దినోత్సవంగా ప్రకటించి వారిని గౌరవించుకోవడం జరిగిందన్నారు. క్రీడాకారులలో క్రీడ స్ఫూర్తిని నింపడానికి గాను వారి పేరును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి నిత్య విద్యార్థిగా ఉంటూ క్రీడలతో పాటు చదువులో రాణించాలన్నారు. మేజర్ ధ్యాన్ చంద్ ఒలంపిక్స్ లో సాధించిన విజయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క క్రీడాకారుడు పతకాలు సాధించాలన్నారు. అలాగే క్రీడల్లో ఇతర దేశాలతో పోటీపడి పతకాల సాధనలో భారతదేశం ముందు ఉండే విధంగా క్రీడాకారులు కృషి చేయాలన్నారు. అనంతరం ఐదు పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేశారు ., ఈ కార్యక్రమంలో సి ఎస్ ఆర్ హెడ్ రవికుమార్. విజయలక్ష్మి. భాస్కర్. ప్రధానోపాధ్యాయులు విక్టర్ ఇమ్మానుయేల్. పిఈటి భుజంగరావు. ఎంపీపీ స్కూల్ హెడ్మాస్టర్ రవికుమార్. బిలకల గూడూరు ఎంపీపీ ఉర్దూ స్కూల్ హెచ్ఎం షేక్ ముబీనా. ఎంపీపీ బిలకల గూడూరు హెచ్ఎం బాలకృష్ణ. విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.