PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కృష్ణం వందే జగద్గురుమ్..శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపు

1 min read

పల్లెవెలుగు వెబ్​ ప్యాపిలీ: త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక ప్యాపిలి కమిటీ  ఆధ్వర్యంన ప్యాపిలి పట్టణం లో  శ్రీ కృష్ణ భగవానుడు ఊరు ఎరిగింపు కార్యక్రమం దిగ్విజయంగా శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు ముగిశాయి. త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక ప్యాపిలి  కమిటీ ఆధ్వర్యంన శ్రీ కృష్ణుడి ప్రతిమ ను శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు ఆగస్టు 26 న సోమవారం  ప్యాపిలి టౌన్ పాత పోస్టు ఆఫీస్ సందు అయ్యప్ప గుడి ప్రక్కన కోటవీధి లో వేదిక నిర్మించి , కొలువు తీర్చి, స్వామికి ప్రతి రోజు ఉదయం సాయంత్రం జ్ఞాన రీత్యా నిత్య పూజలు , భగవద్గీత శ్లోక పారాయణం చేసి 5 వ రోజు ఆగస్టు 30 న ఈ రోజు అనగా శుక్రవారం శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపు కార్యక్రమం కోట వీధి నుండి  బస్ స్టాండ్ మీదుగా చిల్లా కట్ట, క్రింద గేరి ,కుమ్మర వీధి తిరిగి కోట వీధి మండపం వద్దకు మధ్యాహ్నం 1గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్యాపిలి పుర వీధులలో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు.  ఈ గ్రామోత్సవనికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్వో  భారతి ,డిప్యూటీ తాసిల్దార్ మారుతి , ఆర్ ఐ వి.సుధాకర్ రెడ్డి , వీఆర్వో టి.రమేష్  స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక ప్యాపిలి పట్టణ కమిటీ అద్యక్షుడు బి. కేశవులు, ఎం. వెంకటరమణ. వి సురేష్ బాబు, బి. మనోజ్, కే.మధు మరియు  జలదుర్గం, ఏనుగుమార్రి, డోన్, హుసేనాపురం, జొన్నగిరి, ధర్మవరం కమిటీ ల ప్రబోధ సేవా సమితి భక్తులు ఎక్కువగా వచ్చారు ఊరేగింపు లో పాల్గొన్నారు.

About Author