అంగరంగ వైభవంగా ఉలిగమ్మ అవ్వ కుంభోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: మండల కేంద్రమైన హొళగుందలో వెలసిన ఉలిగమ్మ అవ్వ కుంభోత్సవం రజక కులస్తుల ఆద్వర్యంలో ఆశేష జనుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. శ్రావణమాసం నాలుగవ శుక్రవారం పురస్కరించుకుని ఈ కుంభోత్సవాన్ని గ్రామంలో పెద్దబావి వద్ద నుండి గంగిపూజ చేసి అనంతరం భక్తులు మేళతాళాలు, డప్పువాయిద్యాలతో కుంభాన్ని పురవీధుల గుండా ఊరేగింపుగా స్థానిక చాకలి విది వద్ద వెలసిన ఉలిగమ్మ ఆలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ఆకుపూజ, మహామంగళారతి, ప్రత్యేక పూజలు జరిపించారు. అలాగే మహిళలు, చిన్నారులు నైవేద్యం సమర్పించారు. విచ్చేసిన భక్తులకు రజక సంఘం గ్రామ పెద్దలు అన్నదాన వసతి కల్పించారు. వర్షం కురిసి పంటలు బాగా పండాలని అమ్మ వారికి మొక్కుబడులు చెల్లించినట్లు తెలిపారు. అలాగే అందరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మండల రజకులు పాల్గున్నారు.