రాజకీయాలకు అతీతంగా వక్ఫ్ భూముల కోసం పోరాటం చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కడప : వక్ఫ్ ఆస్తులను కాపాడుకునేందుకు రాజకీయాలకతీతంగా పనిచేయాలని రాష్ట్ర ముతవల్లి అసోసియేషన్ ప్రెసిడెంట్ కె ఎం షకీల్ షఫీ అన్నారు. కడప నగరంలోని మానస ఇన్ హాల్లో ఏర్పాటుచేసిన ముతవల్లి ల మేనేజింగ్ కమిటీల చర్చా వేదిక నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ గతంలో దేవాలయాలు చర్చిలు మసీదులు రాజకీయాల కతీతంగా ఉండేవని అన్నారు. ప్రస్తుతం రాజకీయ జండాను పులుముకొని వక్ఫ్ భూములను కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ మా భూములు పోతున్నాయని కోర్టుకు వెళ్లినప్పటికీ కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ ప్రొసీడింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వాలు, అధికారులు ఇచ్చే స్థితిలో లేవన్నారు. ఇలా ఉంటే మళ్లీ చట్ట సవరణ అంటున్నారని ఈ చట్ట సవరణలో ఏమవుతుందో చూడాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాలనే అమలు చేయలేకపోతున్నాం మళ్ళీ కొత్త చట్టాలు తీసుకొస్తున్నాం అంటున్నారు వీటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇటువంటి సమస్యలను పరిష్కరించేందుకు మనమందరం సమావేశమయ్యామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉభయదుల్లా సాహెబ్, కడప ఉమ్మడి జిల్లాలు మసీదు కమిటీ ప్రెసిడెంట్స్ మరియు దర్గా ముతవల్లిలు తదితరులు పాల్గొన్నారు.