విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం… కర్నూలు జిల్లా ఎస్పీ
1 min readప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 96 ఫిర్యాదులు .
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీక్యాంపు కార్యాలయంలో శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ గారు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 96 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
కర్నూలు సచివాలయం లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలు , తాండ్రపాడు కు చెందిన మహేశ్వరెడ్డి అనే వ్యక్తి రూ. 5 లక్షలు తీసుకొని మోసం చేశాడని తుగ్గలి మండలం ,మారెల్ల గ్రామానికి చెందిన లక్ష్మన్న ఫిర్యాదు చేశారు. గూడురు, చనుగొండ్ల గ్రామంలోని మా 3 ఎకరాలలో సాగు చేసిన కందిపంటను గొర్రెలతో మేపి పంట నష్టం చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని కర్నూలు, స్టాంటన్ పురం కు చెందిన ఆనంద్ కుమార్ ఫిర్యాదు చేశారులక్ష్మీపురం గ్రామ శివారులోని 2 ఎకరాల 76 సెంట్ల భూమిని సర్వేయర్ కొలచి హద్దులు పాతితే, ప్రక్క పొలం వారు హద్దులు జరిపి గొడవలు సృష్టిస్తున్నారని వారి పై చర్యలు తీసుకోవాలని డోన్ కు చెందిన నవీన్ కుమార్ ఫిర్యాదు చేశారు.నా భర్త, అత్త లు కలిసి నా పుట్టింటి నుండి అదనపు కట్నం తీసుకురావాలని నన్ను వేధింపులకు గురి చేస్తున్నారని పిల్లలకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కర్నూలు బుధవారపేటకు చెందిన పార్వతి ఫిర్యాదు చేశారు. విత్తనం వేసిన పొలం ను దౌర్జన్యంగా ట్రాక్టర్ తో దున్నించిన వారి పై చర్యలు తీసుకోవాలని సి. బెళగల్ కు చెందిన గోవిందమ్మ ఫిర్యాదు చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ హామీ ఇచ్చారు.ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, సిఐ శివశంకర్, ఎస్సై పెద్దయ్య నాయుడు పాల్గొన్నారు.