ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి
1 min readపి.జి.ఆర్.ఎస్ వచ్చిన అర్జీలను గడవు లోపు పరిష్కారం అయ్యేటట్టు చర్యలు తీసుకోండి.
అర్జీలను నాణ్యతగా పరిష్కరించండి.
ఆదోని సబ్ కలెక్టర్ (ఇంచార్జ్) విశ్వనాథ్ గారు.
పల్లెవెలుగు వెబ్ ఆదోని: పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ (ఇంచార్జ్) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్వనాథ్ గారు పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ లో స్థానిక ఎమ్మెల్యే పార్థ సారధి గారు సబ్ కలెక్టర్ (ఇంచార్జ్) పాల్గొని డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. .మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువు లోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని. :-ఆదోని మండలం దొడ్డనకేరి గ్రామానికి చెందిన బి ఫహద్ సంబంధించి సర్వేనెంబర్ 19 నందు 9.80 ఎకరాల భూమి ఉండగా గతంలో 5.00 ఎకరాల భూమిని అమ్మకం చేయగా వారు అదనంగా 6.50 ఎకరాల భూమిలో సాగులో ఉన్నారు. ప్రభుత్వం తరఫున సర్వే చేయడానికి కూడా వారు సహకరించడం లేదు. 1.50 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనది. దయతో విచారణ చేసి మా యెక్క భూమి హద్దులు చూపవలసినదిగా అర్జి సమర్పించుకున్నారు.ఆదోని పట్టణం 15వ వార్డు వైఎంకె నగర్ లో గత 20 రోజులుగా త్రాగునీరు రావడంలేదని నీరు రాకపోవడంతో ఇబ్బందులు ఉన్నాయని దళిత మా యొక్క సమస్యను పరిష్కరించాలని 15వ వార్డు కాలనీవాసులైన లక్ష్మి, ఆసియా , నాగమ్మ, ఆర్జి సమర్పించుకున్నారు.రోడ్డు ఇరువైపులా ఉన్న డ్రైనేజీలపై కట్టడాలు కట్టడం ద్వారా వర్షపు నీరు రోడ్డుపై రావడం ద్వారా రోడ్డు దెబ్బతిని రవాణకు ఇబ్బందిగా ఉంది. దళిత విచారణ చేసి డ్రైనేజీలో నీరు పోయేటట్టుగా చర్యలు తీసుకోవాలని ఆదోని మండలం గనేకల్ గ్రామానికి చెందిన తాయప్ప, వీరస్వామి రామాంజనేయులు, ఉచ్చిరప్పు అర్జీ సమర్పించుకున్నారు.ఆదోని మండలం మండగిరి గ్రామానికి చెందిన మరాఠ నరసింహులు ఇచ్చే సంబంధించి సర్వే నంబర్ 189 పైకి 4.50 ఎకరాల భూమి ఉండగా ఆన్లైన్లో కేవలం 1.50 ఎకరాల భూమి మాత్రమే ఉన్నది మిగిలిన 3.00 ఎకరాల భూమిని విచారణ చేసి ఆన్లైన్ లో నమోదు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమానికి కార్యాలయపు పరిపాలన అధికారి కే. వసుంధర, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వాయర్ వేణు సూర్య, శ్రీనివాస రాజు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సత్యవతి, డిఎల్పివో నూర్జహాన్, డి ఎల్ డి వో నాగేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రవికుమార్,ఉప తహశీల్దారు పెద్దయ్య, వలి భాష, తదితరులు పాల్గొన్నారు.