సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు పట్టణం యుపిహెచ్సి – జొహరాపురం 2 పరిధిలోని కమ్మ వీధిలో సీజనల్ వ్యాధులపై డీఈఎంఓ శ్రీనివాసులు ఆద్వర్యం లో అవగాహన కార్యక్రమం నిర్వహిండమైనది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు, ప్రజలు సీజనల్ వ్యాధులైన డేoగి,చికూన్ గున్యా,మలేరియ,టైఫాయిడ్, అతిసార పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ,ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు.ప్రస్తుత కాలం లో నీరు కలుషితం కావడం వలన ప్రజలకు వాంతులు , విరేచనాలు మొదలై అనారోగ్యానికి గురి అయ్యె అవకాసమున్నదని. నీరుకాచి చల్లార్చి , వడబోసి త్రాగాలని మరియు బోజనానికి ముందు మలవిసర్జన తరువాత చేతులను సబ్భుతో శుబ్రపరచుకోవాలని తెలిపారు. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్న దగ్గరలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రనికి వెళ్లి పరిక్షలు చేయించుకొని చికిత్సలు తీసుకోవలసినదిగా కోరారు.ఈ కార్యక్రమం లో Dy డీఈఎంఓ చంద్రశేఖర్ రెడ్డి , ఆరోగ్య విద్య భోదకురాలు పద్మావతి , ఆరోగ్య కార్యకర్తలు విద్యావతి , పుల్లమ్మ , మరియు ఉమా ఆశా కార్యకర్త ప్రోజేక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.