వ్యాపారస్ధులు, ఫుడ్ లైసెన్స్ తీసుకొని ఆహార భధ్రత నియమాలను పాటించాలి
1 min readఆహార సంబంధిత 13 కేసుల్లో రూ.1.15 లక్షల జరిమాన విధింపు
జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆహార సంబంధిత వ్యాపారస్తులు తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ తీసుకొని వ్యాపారం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి చెప్పారు. ఆహార సంబంధిత కేసులకు సంబంధించి జాయింట్ కలెక్టర్ కోర్డునందు విచారణ జరిగింది. ఈ సందర్బంగా 13 ఆహార సంబంధిత కేసులను విచారించారు. ఇందుకు సంబంధించి ముద్దాయిలకు 1,15,510 రూపాయలు జరిమాన విధించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆహార భధ్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈవిషయంలో నియమాలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని అటువంటి వారిపై కేసులను నమోదుచేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.