ఏపీఎన్జీవోస్ ఉద్యోగుల స్పందన అభినందనీయం
1 min read1,00,116 రూపాయలు చెక్కును జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి కి అందజేత
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : వరద బాధితులను ఆదుకోవడంలో ఉద్యోగుల స్పందన అభినందనీయమని ఏలూరు జిల్లా కె కలెక్టర్ సెల్వి అభినందించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో విజయవాడలో వరద బాధితులను ఆదుకునే క్రమంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ సభ్యులు సేకరించిన 1,OO,116 రూపాయల చెక్కును మంగళవారం కలెక్టర్ ఛాంబర్ జిల్లా కలెక్టర్ కి అసోసియేషన్ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితిలో వరద బాధితులను ఆదుకోవడంలో ఏపీఎన్జీవో సంఘ సభ్యులు దాతృత్వంతో సేకరించిన సొమ్ము సహాయ చర్యకులకు వినియోగిస్తామని మీరు చేస్తున్న సహాయం స్ఫూర్తిదాయకం అభినందనీయమన్నారు. ఇదే స్పూర్తితో స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు మెరుగైన సేవలు అందించడంలో ముందుకు రావాలనీ పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీవోస్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా చాకచక్యంగా వరద చిక్కుకొన్న మరియు పునరావస బాధితులను ఆదుకోవడం, అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు సహాయ సహకారాలు కార్యక్రమాలు అందించడం గొప్ప విషయం అన్నారు. బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీరు, పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టలు తదితర పరికరాలు గత రెండు రోజులుగా జిల్లా నుంచి పంపడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ కార్యదర్శి మెరుసు రామారావు, జేఏసీ నాయకులు ఆర్ఎస్ హరినాథ్, అసోసియేషన్ నాయకుల కప్పల సత్యనారాయణ, ఎండి బెగ్, పూడి శ్రీనివాస్, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.