ఆరుగురు తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడి
1 min readదాతల సహకారంతోనే ప్రోటీన్లు, పండ్లు, పౌడర్లు బాధితులకు అందజేత
సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు కాట్రగడ్డ సాయజిరావు అందజేత
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తల సేమియా భవనంలో 6 మంది తల సేమియా వ్యాధి బాధిత చిన్నారులకు రక్త మార్పిడి చికిత్స నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బి.వి.కృష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ తల సేమియా సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి చిన్నారులకు రక్త మార్పిడి చికిత్స తో పాటు, దాతల సహకారంతో ప్రోటీన్ పౌడర్లను, పండ్లను కూడా పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈరోజు తల సేమియా చిన్నారులతోపాటు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు కాట్రగడ్డ సాయాజీరావు, ప్రోటీన్ పౌడర్లను ఏలూరు రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఎన్జివిబి స్వామి పంపిణీ చేశారని ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి కె.బి సీతారాం, డాక్టర్:వరప్రసాద రావు, కమిటీ సభ్యులు ఆర్ఎన్ఆర్ బుజ్జి, బి ఆర్ సి హెచ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.