శ్రీకృష్ణ ఫెర్టిలైజర్స్ లో ఎరువుల అమ్మకాలు నిలిపివేత
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది : మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని శ్రీకృష్ణ ఫెర్టిలైజర్స్ దుకాణంలో పంటపొలాలకు వినియోగించే మందులను విక్రయాలు నిలిపివేయాలని మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరెడ్డి బుధవారం ఆదేశించారు. ఈ తనిఖీలో దుకాణ యజమాని సరియైన అనుమతులు చూపించనందున 6 లక్షల 72 వేల రూపాయలు విలువచేసే 24 టన్నుల ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేయడం జరిగినట్లు తెలిపారు. ఎరువుల డీలర్లు తప్పనిసరిగా తమ ఎరువుల లైసెన్సులో ఫారం O ను జత చేసుకోవాలి అన్నారు. అదేవిధంగా ధరల పట్టికలో ఎప్పటికప్పుడు ఎరువుల వివరాలు పొందుపరచాలన్నారు. రైతులకు బిల్లులు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా రైతుల దగ్గర నుంచి బిల్లు పైన సంతకాలు తీసుకోవాలన్నారు. స్టాకు రిజిస్టర్లో ఎరువుల వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరచాలన్నారు.ఈ పాస్ మిషన్ ద్వారానే ఎరువులను అమ్మాలని డీలర్లను హెచ్చరించడం జరిగినది. నిబంధనలకు విరుద్ధంగా ఎరువులు అమ్మితే ఎరువుల నియంత్రణ చట్టం ప్రకారము వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగినది.