వరద బాధితులకు విరాళం
1 min readహొళగుందలో విరాళాలు సేకరిస్తున్న ఆయా పార్టీల నాయకులు, గ్రామపెద్దలు
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద నలుగురికి సహాయం చేసి ఆదుకోవాలనే మనసత్వంతో ఉండి సేవా దృక్పతంతో నడుచుకునే వారు ఆదర్శంగా నిలుస్తారని ఆయా పార్టీల నాయకులు అన్నారు. విజయవాడలో భారీ వర్షాల కారణంగా సర్వం కోల్పోయి అతలాకుతలమైన వరద బాధితులను ఆదుకోవడానికి బుధవారం హొళగుంద మండల కేంద్రంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు, గ్రామపెద్దలు, విద్యార్థి సంఘాలు, స్వచ్చంద సంస్థ ప్రతినిధులు, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు, కుల సంఘాలు, యువకులు విరాళలను సేకరించారు. బస్టాండుతో పాటు గ్రామంలోని ఆయా వీధులు తిరిగి నగదును సేకరించారు. సేకరించిన మొత్తాన్ని వరద బాధితులకు అందించేలా ముఖ్యమంత్రి సహాయనిధికి పంపుతున్నట్లు బాధ్యులు తెలిపారు. విపత్కార పరిస్థితులో ఉన్న వారిని ఆదుకుంటే మాకు మంచి జరుగుతందని ప్రతి ఒక్కరు మానవత్వంతో బాధితులను ఆదుకోవడానికి ముందు రావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి కన్వీనర్ తిప్పయ్య, శేషగిరి, వైయస్సార్ కన్వీనర్ షఫీ ఉల్లా, తోక వెంకటేష్, ఎంపీపీ తనయుడు ఈసా, ఎఫ్ అబ్దుల్ హమీద్, వార్డ్ మెంబర్ అబ్దుల్ సుభాన్, వార్డ్ మెంబర్ అబ్దుల్ రెహ్మాన్, మోయిన్, ఆదం, చిదానంద, మారెప్ప, తదితరులు పాల్గొన్నారు.