షాదీ ఖానా కమిటీకి..కలెక్టర్ ఆమోదం
1 min readఎమ్మెల్యే మరియు శివానందరెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తాం:నూతన కమిటీ
రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బందోబస్తు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ముబారక్ షాది ఖానా నూతన కమిటీకి నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆమోదం తెలిపారు.నూతన కమిటీ వివరాలను కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.షాదిఖానా అభివృద్ధి కమిటీ సభ్యులుగా షేక్ చాంద్ బాష,షేక్ మూర్తు జావలి,డి సత్తార్ మియా,షేక్ మహబూబ్ బాష,ఆశా భీ అను వీరిని అభివృద్ధి కమిటీ సభ్యులుగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.గురువారం మధ్యాహ్నం నూతన కమిటీ సభ్యులు షాదీ ఖానా మరియు పరిసర ప్రాంతాన్ని వారు పరిశీలించారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు చాంద్ భాష,మూర్తు జావలి మాట్లాడుతూ గతంలో షాది ఖానా అభివృద్ధికీ ఎవ్వరూ తోడ్పాటు అందించలేదని రాబోయే రోజుల్లో మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సహకారంతో షాది ఖానా అభివృద్ధి చేస్తామని అన్నారు.గతంలో ఉన్న అభివృద్ధి కమిటీ పాలకులు అభివృద్ధి చేయడాన్ని విస్మరించారు. వీటిని పట్టించుకోక పోవడంతోనే శిథిలా వస్థలో ఉందని అతి తక్కువ ఖర్చుతో పేద ముస్లిం నిరు పేదలకు వివాహ మరియు శుభకార్యాలకు అందించడం జరుగుతుందని వారు అన్నారు.ముందుగా బుధవారం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎ. సునీల్ ఖన్నా నూతన కమిటీ సభ్యులకు కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల పత్రాన్ని అందజేశారు.ముబారక్ షాదీ ఖానా దగ్గర ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.