శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: శ్రీ రాజ రాజేశ్వరి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీ యం. రామేశ్వర రావు ఉపాధ్యాయ దినోత్సవం గురించి మాట్లాడుతూ “డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ -5 న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాముని ఎందుకనగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి అతను తెచ్చిన గుర్తింపు గౌరవము. “తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉంటుందని చాటి చెప్పిన ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ మొట్టమొదట ఉపరాష్ట్రపతిగా 1952లో మరియు రెండవ రాష్ట్రపతిగా 1962 నుండి 1967 మధ్య అయ్యారని. భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతని విద్యార్థులు మరియు స్నేహితులు అతని పుట్టినరోజు వేడుకలు జరపాలని అభ్యర్థించారు. అందుకు సర్వేపల్లి సమాధానం ఇస్తూ నా పుట్టినరోజును జరుపుకునే బదులు సెప్టెంబర్-5 ను ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటే అదే నాకు గర్వకారణం మీరు నాకు ఇచ్చే గౌరవం అన్నారు. ఆరోజు నుండి అతని పుట్టినరోజును 1962 సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాము. భావి భారత దేశంలో ఉపాధ్యాయులే రూపకర్తలు వివిధ రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే నాయకులను ఉపాధ్యాయులు తయారు చేస్తున్నారు. ఉపాధ్యాయుల వల్లే గొప్ప వ్యక్తులు, దిగ్గజాలు తయారవుతారు. భావి పౌరులకు విద్య విజ్ఞానమును అందించే సరైన నిర్దేశం చేయడం వ్యాపార జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తారు. ఉపాధ్యాయులు మనకు బోధించడమే కాదు ఏది మంచి మార్గం ఏది చెడు మార్గం వంటి విషయాలను చెప్పి సమాజంలో విద్యార్థులను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తారు. అని ఉపదేశమిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ దంపతులైన శ్రీ యం.రామేశ్వర రావు మరియు శ్రీమతి యం.శ్రీదేవి ని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల A.O శ్రీ యం.బి.యన్. రాఘవేంద్రరావు మాట్లాడుతూ శిష్యుల ఎదుగుదలే గురుదక్షిణగా భావించే ఒకే ఒక వ్యక్తి ఉపాధ్యాయుడు. విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో ఎన్నో వెలకట్టలేని త్యాగాలు చేసేవారు ఉపాధ్యాయులని, అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పంచి క్రమశిక్షణను అలవర్చి జీవితాన్ని నడిపించేవారు ఉపాధ్యాయులు. ఎందరెందర్నో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది తాను మాత్రం అదే స్థాయిలో ఉంటూ ఆనందపడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల తరువాత స్థానమును, బాధ్యతగా చేపట్టే ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు . ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు జరిగిన వ్యాసరచన మరియు వక్తృత్వపోటీలలో గెలుపొందిన విద్యార్థులందరికీ పాఠశాల కరస్పాండెంట్ శ్రీ యం. రామేశ్వరావు , పాఠశాల A.O శ్రీ యం.బి.ఎన్. రాఘవేంద్రరావు చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం గురించి విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీ యం.రామేశ్వరరావు , పాఠశాల A.O శ్రీ యం.బి. యన్.రాఘవేంద్రరావు మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఉపాధ్యాయ దినోత్సవమును ఘనంగా జరిపారు.