మూగజీవాలకు గాలికుంట్లు వ్యాధి సోకకుండా వ్యాక్సిన్..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల పరిధిలోని ఎల్కే తాండ గ్రామంలో ఆవులు ఎద్దులు బర్రె లకు గాలి కుంట్లు రాకుండా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఎఫ్ ఎం డి ఇంజక్షన్. మేకలు గొర్రెలకు పి పి ఆర్ ఇంజక్షన్. ఇచ్చారు ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ అధికారులు మాట్లాడుతూ వర్షాకాలంలో మూగజీవాలకు గాలి కుంట్లు వ్యాధి సోతుందని అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాబు నాయక్ అనిమల్ హజ్బెండరి అసిస్టెంట్ షబానా గ్రామ పశువుల కాపరిలు మాతృ నాయక్, సంతోషం నాయక్,సాల నాయక్,రాజ నాయక్, థాయన నాయక్, మంగే నాయక్, శంకర్ నాయక్, మద్దిలేటి నాయక్ తదితరులు పాల్గొన్నారు.