వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి
1 min read– నిరీక్షణ టీం బొబ్బిలి శ్రీను
పల్లెవెలుగు వెబ్ విజయవాడ : గత కొన్ని రోజులుగా రాష్ట్ర నలుమూలా కురుస్తున్న భారీ వర్షాలకు , వరదలకు వందలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు అని ప్రతి ఒక్కరూ వారిని ఆదుకోవలసిన అవసరం వుంది అని నిరీక్షణ టీం లీడర్ బొబ్బిలి శ్రీను అన్నారు ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు సగటు మనిషిగా మనకు చేతనైనoత వరకు తోటి వారికి సహాయ పడాలనే ఉద్దేశంతో గత రెండు రోజులుగా 5,6 తేదీలలో విజయవాడలోని యనమలకుదురు కరకట్ట ప్రాంతంలో దాదాపు అయిదు వందల మందికి నిరీక్షణ టీం 50 వేలరూపాయల సొంత ఖర్చుతో భోజన పదార్ధాలు అందించటం జరిగింది అని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇలానే ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయం చేసి బాధిత కుటుంబాలకు ఆదుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో దళితసంక్షేమసంఘం వుమ్మడి కృష్ణజిల్లా అధ్యక్షుడు పాతూరి చంద్రశేఖర్ పాల్గొని ఆయన మాట్లాడుతూబొబ్బిలి శ్రీను గత రెండు రోజులుగా పేదలకు అన్నదానం చేస్తు మానవ సేవే మాధవ సేవ అని అనేక మందికి ఆదర్శంగా నిలిచారు అని కొనియాడారు ఇలానే ప్రతివారు తమవంతు ప్రజల కష్ట సమయాలలో కలిసి ముందుకు వెళ్ళాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు రత్తయ్య నాయుడు,నిరీక్షణ టీం సభ్యులు నాగబాబు,చరణ్, కార్తీక్, నాని,ఫణి సామ్యూల్, రమేష్ ,హరీష్ పాల్గొన్నారు.