శ్రీశైలంలో వినాయకుని విగ్రహాల ఉచిత పంపిణీ
1 min readవినాయకచవితిని పురస్కరించుకుని దేవస్థానం వారు ఉచితంగా వినాయకస్వామి మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తోంది.
పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: వినాయకస్వామిని పూజించేందుకుమట్టివిగ్రహంతో పాటు మారేడు, గరిక, ఉమ్మెత్త, రేగు, మామిడి, గన్నేరు, జమ్మి, రావి, జిల్లెడు మొదలగు పత్రాలను కూడా శ్రీశైల ప్రజలకు మరియు భక్తులకు ఆలయ అధికారులు అందజేస్తున్నారుమన సంస్కృతీ సంప్రదాయాలపై భక్తులలో అవగాహన కల్పించేందుకు మరియు పర్యావరణ పరిరక్షణలో భాగంగా దేవస్థానం ఈ మట్టి విగ్రహాల ఉచిత పంపిణీని చేపట్టడం జరిగింది. మన శాస్త్రాలు వినాయకచవితిరోజు మట్టితో చేసిన వినాయకుడిని పూజించాలని వినాయకచవితిరోజు మట్టితో చేసిన వినాయకుడిని పూజించడం వలన విఘ్నాలన్నీ తొలగి కార్యజయం జరుగుతుందని కూడా మన శాస్త్రాలు చెబుతున్నాయి.మట్టివిగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమములో డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్. రమణమ్మ, శ్రీస్వామివార్ల ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి, ఆలయ విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి ఎం.హరిదాసు, ప్రజాసంబంధాల అధికారి టి.శ్రీనివాసరావు, పర్యవేక్షకులు కె. అయ్యన్న, కె. గిరిజామణి తదితర సిబ్బంది పాల్గొన్నారు.