మాజీ సైనికుల పాత కమిటీ రద్దు..
1 min read15 న నూతన కమిటీ ఎన్నికలు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మాజీ సైనికుల సంఘం పాత కమిటీని రద్దు చేసినట్లు మాజీ సైనికుడు శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.మాజీ సైనికుల కమిటీ అధ్యక్షుడిగా 2018 నుంచి రాజు కొనసాగుతున్నారు.మూడు సంవత్సరాలుగా రాజు అధ్యక్షుడు గా ఉన్నా మాజీ సైనికుల సమస్యలు పరిష్కారం చేయడంలో విఫలమయ్యారని తెలిపారు. నూతన కమిటీ ఎన్నికల కోసం సోమవారం నుంచి నామినేషన్ దాఖలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల15న ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కమిటీ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆసక్తి ఉన్న మాజీ సైనికులు నామినేషన్ దాఖలు చేయాలని పిలుపునిచ్చారు.